కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో రైళ్లను నడపడం శ్రేయస్కరం కాదని ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేసారు. అంతేకాకుండా రాష్ట్రాల అప్పులను రీషెడ్యుల్ చేయాలనీ, ఎఫ్ ఆర్బీఎం పరిమితి పెంచాలని, ఏ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను ఆయా రాష్ట్రాలు అనుమతించాలని కేసీఆర్ సూచించారు. మే 17 తో ముగియనున్న లాక్ డౌన్ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రధానంగా మూడు అంశాలను ప్రధానికి వివరించారు.
కాగా, జులై, ఆగస్టు నెలల్లో కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని, అది కూడా హైదరాబాద్ నుంచి వచ్చే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేసారు. ప్రస్తుత పరిస్థితుల్లో వెంటనే రైళ్లను పునరుద్దరించవద్దని కేసీఆర్ విజ్ఞప్తి చేసారు. దేశంలో చాలా నగరాల్లో కరోనా ప్రభావం ఉంది. ఈ ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో కరోనా భాదితులున్నారు. అందువల్ల ఇప్పుడు రైళ్లు నడిపితే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రజల రాకపోకలు ఎక్కువగా జరుగుతాయి. ఎవరు ఎటు వెళ్తున్నారో, అందులో ఎవరికీ కరోనా ఉందొ తెలియదు. ఈ నేపథ్యంలో అందరికి టెస్టులు చేయడం కూడా కుదరదు. అందువల్ల ఇప్పుడు ప్రయాణికుల రైళ్లను నడపవద్దని కేసీఆర్ కోరారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…