టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, తమిళ హీరో శరత్ కుమార్ మధ్య ఉన్న స్నేహ బంధం గురించి మనందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరూ కేవలం స్నేహితులే మాత్రమే కాకుండా.. కుటుంబ సభ్యుల్లా వీరువురు కలిసి ఉంటారు. అంతేకాకుండా వీరు సినిమాల వరకే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎంతో మంచి మిత్రులు కావడం, కష్టాల్లో ఉన్న శరత్ కుమార్ కూడా ఒకానొక సమయంలో చిరంజీవి సహాయాన్ని అడిగారట. దీనికి చిరు ఓకే అన్నాడని, అలనాటి సంగతులను గుర్తు చేసుకుంటూ శరత్ కుమార్ కన్నీరు పెట్టుకుంటూ తెలిపాడు. దీనితో ఆయన లైవ్ లోనే కంటతడి పెట్టేశాడు అంటే నమ్మండి.
ఇక అసలు విషయానికి వెళితే … మెగాస్టార్ బ్లాక్ బ్లాస్టర్ సినిమా జగదేకవీరుడు అతిలోక సుందరి రిలీజై మే9 కు 30 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇక ఈ క్రమంలోనే వైజయంతీ మూవీస్, చిరంజీవి సోషల్ సోషల్ వేదికగా ఎమోషనల్ అయ్యారు. అయితే 30 సంవత్సరాల జగదేకవీరుడు పండగ ఒక రేంజ్‌లో జరిగింది. అయితే ఈ మేరకు ఒక ఛానెల్ లో రాధిక, శరత్ కుమార్ మాట్లాడారు. మాములుగా చిరుతో అత్యంత సాన్నిహిత్యం ఉన్న రాధిక, శరత్ కుమార్ లు ఒక మీడియాకు లైవ్ ఇంటర్వ్యూలో ఇచ్చాడు. ఈ మేరకు చిరుతో ఉన్న అనుబంధం గురించి రాధిక ఆవిడ మాటలలో వివరించింది. తాను ఎప్పుడు చిరు పట్ల గర్వంగానే ఫీల్ అవుతానని ఆవిడ తెలిపింది.
ఇక హీరో శరత్ కుమార్ మాట్లాడుతూ… తాను ఒకానొక సమయంలో పూర్తిగా డౌన్ ఫాల్ లో ఉన్నపుడు, అప్పులు కూడా బాగా పెరిగిపోయాయని చెప్పుకొచ్చాడు. ఇక అదే సమయంలో ఒక నిర్మాత తనను చిరంజీవి డేట్స్ ను పట్టుకొస్తే.. నీకు కొంత డబ్బులు వస్తాయి దానితో నీ అప్పులన్నీ తీరుతాయి అని సలహా ఇచ్చారు. అయితే ఆ వెంటనే చిరుకు ఫోన్ చేస్తే హైదరాబాద్ లో ఉన్నా అని తెలిపాడు. అయితే ఆ తర్వాత తను షూటింగ్ జరుగుతుండగా తాను చిరు వద్దకు వెళ్లానని తెలిపాడు. ఆయనతో పర్సనల్ గా మాట్లాడాలని చెప్పడంతో మధ్యాహ్నం షూటింగ్ ను క్యాన్సిల్ చేసి మరీ, డైరెక్టర్ ను పిలిచి రేపు షూటింగ్ పెట్టుకుందామని, నేను వచ్చానని చెబుతూ మాట్లాడుకుంటామని చెప్పాడు.
ఇక ఆ తర్వాత ప్రేమగా ఆయన భోజనం వడ్డించి.. సమస్య ఏంటో చెప్పమన్నాడని గుర్తు చేసుకున్నాడు. అప్పుడు తానూ నీ డేట్స్ కావాలి.. నాకున్న అప్పులు తీరిపోతయి అని చిరును అడిగినట్టు ఆయన చెప్పాడు. దీనితో చిరు వెంటనే ఓకే చెప్పాడని, తదుపరి చిత్రం వారికే ఇస్తానని తెలిపాడు. ఇకపోతే ఆ సినిమాకు కాను రెమ్యూనరేషన్ ఎంత..? అని అడిగినందుకు.. నాకు రెమ్యూనరేషన్ ఇస్తావారా …? అని చిరు ఫైర్ అయ్యాడని చెప్పుకొచ్చాడు. నువ్వు కష్టాల్లో ఉన్నానని చెప్పావుగా నాకు రెమ్యూనరేషన్ వద్దని చిరు అప్పటి విషయాలను గుర్తు చేసుకుని శరత్ కుమార్ కన్నీరు పెట్టుకున్నాడు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…