Raviteja Mother: హీరో రవితేజ తల్లి రాజ్యలక్ష్మి పై పోలీస్ కేసు నమోదు.. ఎందుకంటే?
Raviteja Mother: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ తల్లి భూపతి రాజ్యలక్ష్మి పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే రవితేజ తల్లి పై పోలీస్ కేసు నమోదు కావడంతో ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.అసలు ఎప్పుడూ వార్తలలో కూడా వినిపించని ఈమె పై పోలీసులు ఎందుకు కేసు నమోదు చేసారనే విషయం గురించి పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు.
ఈ క్రమంలోనే రవితేజ తల్లి రాజ్యలక్ష్మితో పాటు మర్రి పాకకు చెందిన సంజయ్ అనే వ్యక్తి పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా వీరి పై పోలీసులు కేసు నమోదు చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే…
తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం వద్ద ఉన్న సర్వే నంబర్ 108, 124లో పుష్కర కాలవ స్లూయిజ్ నిర్మాణ పనులను రవితేజ తల్లి రాజ్యలక్ష్మితో పాటు సంజయ్ అనే వ్యక్తి ఆ నిర్మాణ పనులను ధ్వంసం చేశారని పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు.
ఈ విధంగా ప్రభుత్వ ఆస్తులను అధికారుల అనుమతి లేకుండా ఇష్టానుసారంగా వీరు నాశనం చేయడంతో పోలీసులు పోలీస్ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.రవితేజ తల్లి ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నారు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది. మరి రవితేజ తల్లి పై పోలీస్ కేసు పెట్టడంతో హీరో రవితేజ ఏవిధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…