Pooja Hedge:టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో బిజీ అయ్యారు. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలైన కొద్ది రోజులకే మహేష్ బాబు తల్లి తండ్రి ఇద్దరు మరణించడంతో మహేష్ బాబు పుట్టెడు దుఃఖంలో ఉన్నారు.ఇలా ఆయన ఎంతో బాధలో ఉన్నప్పటికీ తన తండ్రి మరణించిన వారం రోజులకే సినిమా షూటింగుకు తాను సిద్ధంగా ఉన్నానని డైరెక్టర్ కు కబురు పంపారు.
ఇలా మహేష్ బాబు సినిమా షూటింగ్ కు సిద్ధంగా ఉన్నప్పటికీ ఈ సినిమా మరింత ఆలస్యం కానుందని తెలుస్తుంది.అయితే ఈ సినిమా ఆలస్యం కావడానికి గల కారణం కేవలం పూజ హెగ్డే అని తెలియడంతో మహేష్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున నటి పూజా హెగ్డే పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి కావాల్సిన ఈ సినిమా మహేష్ బాబు తల్లిదండ్రులను కోల్పోవడం వల్ల ఆలస్యమైంది.
ఇక మహేష్ బాబు సినిమా షూటింగ్ కి సిద్ధమని కబురు పంపినప్పటికీ పూజా హెగ్డే మాత్రం ఈ సినిమా షూటింగ్లో పాల్గొనలేకపోతున్నారు.అందుకు గల కారణం ఈమె రెండు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ సినిమా వాయిదా వేసినట్టు సమాచారం.ఇలా పూజా హెగ్డే బాలీవుడ్ సినిమాలకు ఇచ్చిన ప్రాధాన్యత టాలీవుడ్ సినిమాలకు ఇవ్వలేదని మహేష్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ఈ విధంగా తెలుగు సినిమాల పట్ల ఏమాత్రం అంకితభావం లేనటువంటి పూజా హెగ్డేని వెంటనే ఈ సినిమా నుంచి తప్పించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి కావాల్సిన ఈ సినిమా మరింత ఆలస్యం కానుందని తెలియడంతో మహేష్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…