Movie News

Anasuya: జబర్దస్త్ ను చాలా మిస్ అవుతున్నా… అనసూయ షాకింగ్ కామెంట్స్!

Anasuya: బుల్లితెర గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా తన కెరీర్ ప్రారంభించిన అనసూయ జబర్దస్త్ షోలో యాంకరింగ్ తో పాటు తన అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇలా ఛానల్ తో సంబంధం లేకుండా బుల్లితెర మీద ప్రసారమవుతున్న అనేక టీవీ షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూ మంచి గుర్తింపు పొందిన అనసూయ సినిమాలలో నటించే అవకాశాలు కూడా అందుకుంది.

టీవీ షోలో ఎంతో ఆ గ్లామరస్ గా కనిపించే అనసూయ సినిమాలలో మాత్రం చాలా వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు పొందింది. ఇలా వరుస టీవీ షోలు, సినిమాలతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో అనసూయ షేర్ చేసే పోస్ట్ నిమిషాలలో వైరల్ గా మారుతుంది. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో అనసూయ చేసే వ్యాఖ్యలకు విమర్శలు కూడా ఎదుర్కొంటుంది.

ఇదిలా ఉండగా సినిమా అవకాశాలు ఎక్కువగా రావడంతో కొంతకాలం క్రితం అనసూయ జబర్దస్త్ కి దూరం అయింది. ప్రస్తుతం అనసూయ సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉంటుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తాజాగా సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చటించి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఈ క్రమంలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలో టీవీ షోలలో మళ్లీ ఎప్పుడు కనిపిస్తారు అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ.. కావాలని టీవీ షోలకు బ్రేక్ తీసుకున్నా.. ఏదైనా మంచి కంటెంట్ ఉన్న షో ఆఫర్ వచ్చినప్పుడు కచ్చితంగా స్మాల్ స్క్రీన్ మీద రీ ఎంట్రీ ఇస్తా అంటూ చెప్పుకొచ్చింది.

Anasuya: నా జీవితంలో జబర్దస్త్ కు ప్రత్యేక స్థానం ఉంది…


అలాగే మీరు జబర్దస్త్ ని మిస్ అవుతున్నారా? అని మరొక అభిమాని అడిగిన ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ.. అవును జబర్దస్త్ ని చాలా మిస్ అవుతున్నా. నా జీవితంలో జబర్దస్త్ కి ఎప్పుడు ఒక స్పెషల్ స్థానం ఉంటుంది. కొన్ని సందర్భాలలో మనం కోరుకున్న చోటులో ఉండలేకపోవచ్చు. అలాగే జీవితంలో రిస్క్ తో కూడుకున్న నిర్ణయాలు తీసుకోకతప్పదు అంటూ సమాధానం చెప్పింది. జబర్దస్త్ గురించి అనసూయ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago