Categories: FeaturedMovie News

Pooja Hedge: ఆటోలో ప్రయాణం చేస్తున్న బట్టబొమ్మ పూజా హెగ్డే… లగ్జరీ కార్లన్ని ఏమైనట్టు!

Pooja Hedge: ముకుంద సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన పూజా హెగ్డే ఆ తర్వాత అలా వైకుంఠపురం సినిమాతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో ఎందరో స్టార్ట్ హీరోల సరసన నటించిన పూజ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అంతే కాకుండా మరొకవైపు బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉంది.

ఇదిలా ఉండగా ఇటీవల ఈ అమ్మడికి వరుస పరాపజయాలు ఎదురవుతున్నాయి. ఈ అమ్మడు నటించిన సినిమాలు అన్నీ కూడా ప్లాఫ్ అవడంతో ఐరన్ లెగ్ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
అయినప్పటికీ తెలుగు, హిందీ భాషలలో అవకాశాలు మాత్రం తగ్గటం లేదు. ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు సరసన ఎస్ ఎస్ ఎం బి 28 సినిమాలో నటిస్తోంది. అయితే కొన్ని కారణాలవల్ల ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడింది. దీంతో మహేష్‌బాబు ఫ్యామిలీ తో ఫారెన్‌ వెళ్లారు. మరోవైపు పూజా హెగ్డే సైతం వెకేషన్‌కి వెళ్లింది.. ఈ క్రమంలో ఆమె శ్రీలంకలో సందడి చేస్తోంది. ప్రస్తుతం శ్రీలంక వెకేషన్ కి సంబంధించిన పూజా హెగ్డే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలలో జబ్బలపై టాప్‌ జారిపోతుండగా, చిలిపి నవ్వులు చిందిస్తూ పూజా హెగ్డే ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అయితే శ్రీలంక వెకేషన్ లో పూజా హెగ్డే తన ఖరీదైన కార్లను పక్కనపెట్టి ఆటోలో ప్రయాణించటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సినిమాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్న పూజా హెగ్డే కి కోట్ల రూపాయల విలువ చేసే ఖరీదైన కార్లు ఉన్నాయి. ఏ దేశానికి వెళ్లినా కూడా లగ్జరీ విషయంలో ఏమాత్రం వెనుకాడరు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఖరీదైన కార్లల్లో తిరుగుతూ ఉంటారు. కానీ శ్రీలంకలో మాత్రం పూజా హెగ్డే ఖరీదైన కార్లను పక్కనపెట్టి ఒక సామాన్య వ్యక్తి లాగా ఆటోలో ప్రయాణించడం ఆశ్చర్యపరుస్తుంది.

Pooja Hedge: త్వరగా వెళ్లేందుకు..

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజెన్లు ఆమె మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. శ్రీలంకలో త్వరగా వెళ్లేందుకు తాను ఆటోని ఆశ్రయించినట్టుగా పూజ తెలిపింది. దీంతో ఆమె తన అవసరం కోసం ఆటోలో వెళ్లినా కూడా మే డే రోజు ఆటోలో ప్రయాణించడంతో అభినందనలు తెలియజేస్తున్నారు. కార్మికుల్లో ఒకరైన ఆటో డ్రైవర్లకి కొంత సపోర్ట్ గా నిలిచినట్టే అవుతుందని, వారిని గౌరవించినట్టే అవుతుందని ఆమె అభిమానులు కొనియాడుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago