Categories: FeaturedMovie News

Chaitanya Master: చైతన్య చనిపోవటానికీ అప్పులు కాకుండా ఏదో కారణం ఉంది: చైతన్య మేనమామ

Chaitanya Master: ఢీ ఫేమ్ చైతన్య మాస్టర్ తాజాగా ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. ఢీ షో ద్వారా డాన్స్ మాస్టర్ గా గుర్తింపు పొందిన చైతన్య చాలా కాలంగా డాన్స్ మాస్టర్ గా రాణిస్తున్నాడు. అయితే తాజాగా ఆయన అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నాడనీ ఒక సెల్ఫీ వీడియో విడుదల చేసి నెల్లూరులోనే ఒక హోటల్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

చైతన్య మరణంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తన కెరీర్ కోసం, కుటుంబం కోసం చైతన్య మాస్టర్ అప్పులు చేశాడని, అయితే అప్పులు తీర్చే స్తోమత లేక మరణించాడని కొంతమంది తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా చైతన్య ఆత్మహత్య గురించి తాజాగా ఆయన మేనమామ స్పందిస్తూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. చైతన్య మరణానికి అప్పులు కారణం కాదని, మరేదో కారణం ఉందని అనుమానం వ్యక్తం చేశాడు.

లక్షల్లో అప్పు చేసే అవసరం చైతన్యకు లేదని తాను చిన్నప్పటినుండే హైదరాబాదులో ఉంటున్నాడని చైతన్య మేనమామ వెల్లడించాడు. అంతేకాకుండా తాను సంపాదించిన డబ్బు మీద అతన్ని కుటుంబం ఆధారపడలేదని, చైతన్యకి అవసరమైనప్పుడు అతని కుటుంబ సభ్యులే డబ్బు పంపేవారని ఆయన తెలిపాడు..అంతేకాకుండా ఇటీవల చైతన్య చెల్లి పెళ్లి కోసం కూడా ఒక రూపాయి ఇవ్వలేదని కుటుంబ సభ్యులే పెళ్లి భారాన్ని భరించారని ఆయన తెలిపాడు.

Chaitanya Master: పేమెంట్ ఆగిపోవడమే…


ఒకవేళ అప్పులు ఉన్న వేళల్లోనే కానీ లక్షల్లో అప్పులు చేసే అవసరం చైతన్యకి లేదని చైతన్య మేనమామ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా చైతన్య మాస్టర్ మరణం గురించి తోటి డాన్సర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చైతన్య మాస్టర్ ఇటీవల ఒక ఈవెంట్ ఒప్పుకున్నాడని అయితే కొంతమంది డాన్సర్లు అతనికి హ్యాండ్ ఇవ్వటంతో దాదాపు లక్షల్లో పేమెంట్ ఆపేసారని , అందువల్ల చైతన్య మాస్టర్ బయట అప్పు చేసి డాన్సర్లకు ఇచ్చినట్లు తెలుపుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago