దక్షిణాది చిత్రపరిశ్రమతోపాటు బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తూ మోస్ట్ బిజీ హీరోయిన్‌గా మారుతున్నారు కథానాయిక పూజాహెగ్డే. ఇప్పటికే ఆమె నటించిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుదల అయి మంచి టాక్ తెచ్చుకుంది. దీంతో ఆమె గ్రాఫ్ మరింతగా పెరిగిందనే చెప్పాలి. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదలైన ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్లు వస్తున్నాయి. పండగ సీజన్ ను క్యాష్ చేసుకుని వసూళ్ల వర్షం కురిపిస్తుంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మరింత వేగంగా జరుగుతున్నాయి.
ఇప్పటికే వైజాగ్ లో థాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు మేకర్స్. తర్వాత హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాల్గొన్నారు. అతడు మాట్లాడుతూ.. ‘‘తనకు ఒక్కరికే పూజా హెగ్డే ప్రత్యేకం అనుకున్నా.. కానీ అందరి హీరోలకీ స్పేషలే’’ అంటూ చెప్పుకొచ్చాడు. అఖిల్ కు మంచి హిట్ లభించిందని.. తనకు అతడు తమ్ముడు లాంటివాడు అంటూ చెప్పాడు. మంచి కథాంశాన్ని ఎంచుకున్నాడని కితాబిచ్చాడు.
అంతే కాకుండా లవ్ స్టోరీ సినిమాతో హిట్ కొట్టిన నాగచైతన్యకు కూడా శుభాకాంక్షలు తెలియజేశాడు. ముకుంద సినిమా నుంచి పూజా హెగ్డే వైవిద్యమైన కథలతో ముందుకు వెళ్తోంది అంటూ చెప్పాడు. ఈ చిత్రంతో ఆమె మరో అడుగు ముందుకు వేసిందని చెప్పాడు. ఆమె ఏ హీరోతో నటించినా హిట్ గ్యారెంటీ అంటూ చెప్పుకొచ్చాడు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…