ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హీరో జగపతిబాబు. నందమూరి బాలకృష్ట హీరోగా నటించిన లెజెండ్ చిత్రంతో విలన్ గా అవతారమెత్తాడు జగపతి బాబు. ఆ సినిమాతోనే విలన్ గా అతడు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్ గా చేశాడు. హీరోగా హిట్ టాక్ తెచ్చుకున్న సినమాల కంటే కూడా.. అతడికి విలన్ గా ఎన్నో హిట్ లను కొట్టేశాడు. తర్వాత తండ్రి పాత్రలో కూడా నటిస్తూ మంచి పేరు తెచ్చున్నాడు.
విలన్ గా మారిన తర్వాత ఫుల్ బిజీ అయిన టాలెంటెడ్ యాక్టర్ నెక్ట్స్ స్టెప్ హిందీ తెర మీదకి వేయబోతున్నాడు. అంతే కాదు జగపతిబాబు నెగెటివ్ రోల్ లో కనిపించబోయే అతి పెద్ద ప్రాజెక్టు కూడా ఇదే. జగపతి బాబు నెగటివ్ రోల్‌లో కనిపించబోయే భారీ బాలీవుడ్ మూవీలో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ అలరించనుంది. ఇక హీరోగా మల్టీ టాలెంటెడ్ యాక్టర్ ఫర్హాన్ అఖ్తర్ కనిపించనున్నాడు.
ఆయన పాత్ర ఒక ఫారెస్ట్ ఆఫీసర్‌గా తెర మీద పోరాడనుందట. ఈ సినిమాకు ‘పుకార్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. దీనికి అశుతోష్ గోవికల్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్‌లో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. రానున్న రోజులలో జగపతి బాబు హిందీ సినిమాలతోను బిజీ కానున్నట్టు తెలుస్తోంది. మొదటి నుంచి హిందీలో ఆఫర్లు వస్తున్నా అతడు రిజెక్ట్ చేస్తూ వచ్చాడు. తాజాగా ఈ సినిమాకు అతడు ఓకె చేసినట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…