Poonam Kaur: పూనమ్ కౌర్ నటిగా నటించినది చాలా తక్కువ సినిమాలు అయినప్పటికీ ఈమె ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అయితే ఈమె సినిమాల పరంగా సంపాదించిన క్రేజ్ కన్నా సోషల్ మీడియా వేదికగా చేసే వివాదాస్పద పోస్టులు ద్వారా వార్తల్లో నిలిచారు.ఈమె సోషల్ మీడియా వేదికగా ఒకరిని టార్గెట్ చేస్తూ పరోక్షంగా వారి గురించి సంచలనమైనటువంటి పోస్టులు చేస్తుంటారు.
ఈ విధంగా ఈమె చేసే పోస్టుల కారణంగా వార్తల్లో నిలిచారు. అయితే ఈమె సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించి మాత్రమే కాకుండా రాజకీయ విషయాల గురించి కూడా మాట్లాడుతూ పోస్టులు చేస్తుంటారు. అయితే గురుపౌర్ణమి సందర్భంగా ఈమె గురువు గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాను. గురువును టామ్, డిక్ అని పిలవద్దని. నీతులు చెప్పి స్టేజ్ మీద జీవితాలతో ఆడుకునేవాడు గురువు కాదు. మీకు దారి చూపించేవారు గురువు అవుతారు అంటూ ఈమె చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది అయితే ఈమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారో అంటూ నేటిజన్స్ తలలు పీక్కుంటున్నారు.
బహుశా ఈమె పరోక్షంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఈ పోస్ట్ చేశారని అర్థమవుతుంది. ఏది ఏమైనా ఈమె ఇలా పరోక్షంగా గురువు గురించి ఈ విధమైనటువంటి కామెంట్స్ చేస్తూ చేసినటువంటి పోస్ట్ సంచలనంగా మారింది. అయితే గతంలో పూనమ్ గురించి పవన్ కళ్యాణ్ గురించి ఎన్నో వార్తలు వైరల్ అయిన విషయం మనకు తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…