Poonam Kaur: మాయాజాలం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయయ్యారు నటి పూనమ్ కౌర్. ఇలా పలు సినిమాలలో నటించిన ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదని చెప్పాలి. ఇలా ఇండస్ట్రీలో నటిగా సక్సెస్ కాలేకపోయినా ఈమె మాత్రం ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్నారు తరచూ సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఎంతో పేరు పొందారు.
ఈమె ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు గురించి మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటారు. అలాగే రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి కూడా తన అభిప్రాయాలను తెలియజేయడం వల్ల తాను చేసే వ్యాఖ్యలు కారణంగా వార్తల్లో నిలుస్తూ ట్రోలింగ్ కి కూడా గురవుతూ ఉంటారు. తాజాగా ఈమె ఒక కార్యక్రమంలో పాల్గొని వేదికపై కంటతడి పెట్టుకున్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాజ్ భవన్ లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నటువంటి పూనమ్ కౌర్ మాట్లాడుతూ నేను తెలంగాణలోనే పుట్టి తెలంగాణలోనే పెరిగాను. కానీ నన్ను మాత్రం నా మతం పేరుతో వేరు చేస్తున్నారు అంటూ ఎమోషనల్ అయ్యారు.
నేను పంజాబీ అని, సిక్కు అని నా మతం చూసి నన్ను తెలంగాణ నుంచి వేరు చేస్తున్నారని, అలా నన్ను వేరు చేయకండి నేను కూడా తెలంగాణ బిడ్డనే అంటూ ఈ సందర్భంగా ఈమె ఎమోషనల్ అయ్యారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వీడియోలపై పలువురు యధావిధిగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…