Poonam Kaur: పూనమ్ కవర్ పరిచయం అవసరం లేని పేరు. ఇటీవల కాలంలో ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ పరోక్షంగా ఈమె చేసే పోస్టులు మాత్రం సంచలనంగా మారాయి. ఇక ఈమె ఇటీవల రాష్ట్ర రాజకీయాలను దృష్టిలో పెట్టుకునే పరోక్షంగా కొందరిని టార్గెట్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు.
అయితే తాజాగా మరోసారి ఈమె సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ట్వీట్ వైరల్ గా మారింది. గతంలో ఈమె దాసరి నారాయణరావు గారి గురించి ఎంతో గొప్పగా చెప్పిన సంగతి మనకు తెలిసిందే. ఆయన ఇండస్ట్రీ పెద్దగా ఎంతో హుందాగా నడుచుకునే వారని అందరికీ సమన్యాయం చేసేవారు అంటూ దాసరి గారి గురించి చెబుతూ తనని ఆరాధించేవారు.
తాజాగా దాసరి నారాయణరావు గారితో కలిసి దిగినటువంటి ఫోటోని ఈమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోని షేర్ చేసినటువంటి పూనమ్ దాసరి గారు ఇండస్ట్రీ పెద్దగా ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా అందరికీ సమన్యాయం చేసేవారు. ఇక టాలెంట్ ఉన్నటువంటి వారిని ప్రోత్సహించే విషయంలో ముందుంటారు. ఈయనే ఇండస్ట్రీకి అసలైన గురువు అంటూ ఈమె చెప్పుకోవచ్చారు.
అర్హత దాసరి గారికే..
ఇక కొంతమంది స్క్రిప్టులను దొంగతనం చేయవచ్చేమో కానీ ఆయన వద్ద నుంచి గురువు అనే పదాన్ని లాక్కోలేరని ఆ పదానికి సరైన అర్థం,ఆ బిరుదు అందుకొనే సమర్థత దాసరి నారాయణరావు గారికి మాత్రమే ఉంది అంటూ ఈ సందర్భంగా ఈమె పరోక్షంగా డైరెక్టర్ త్రివిక్రమ్ ను ఉద్దేశించి చేస్తున్నటువంటి ఈ పోస్టు సంచలనంగా మారింది..
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించే మహాలక్ష్మి పథకం ఇప్పటికే అందరికీ తెలిసిన విషయం. అయితే తాజాగా…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…