Poonam Kaur: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా వచ్చింది అంటే ఆ సినిమా ఎలాంటి సంచలనాలను అందుకుంటుందో అందరికీ తెలిసిందే. ఇలా త్రివిక్రమ్ సినిమాలంటే ప్రేక్షకులలో కూడా భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇకపోతే తాజాగా త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. అయితే ఈ సినిమా ఒరిజినల్ సినిమా కాదని ఈ సినిమాని త్రివిక్రమ్ యద్దనపూడి సులోచనారాణి రాసిన కీర్తి కిరీటాలు అనే నవలను ఆధారంగా చేసుకుని రాశారు అంటూ వార్తలు వస్తున్నాయి.
ఇలా ఈ సినిమా కాఫీ అంటూ వస్తున్నటువంటి ఈ వార్తలపై నటి పూనమ్ కౌర్ స్పందించారు. ఆయన దేనినైనా చేయగల సమర్థుడు అంతేకాకుండా దాని నుంచి ఎలాగా తప్పించుకోవాలో కూడా బాగా తెలిసిన వ్యక్తి అంటూ కామెంట్ లు చేశారు. తన తప్పుడు పనులు ప్రజలకు కనపడకుండా చేయగల నైపుణ్యం ఉన్నవారు.
కొంతమంది గుడ్డిగా నమ్ముతారు..
కొంతమంది ఆయనని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ప్రజలకు సహాయం చేయడానికి రాని గత ప్రభుత్వం ఆయనకు మాత్రం భారీగా సహాయం చేసిందని అది ఎందుకో ఇప్పటికి నాకు అర్థం కాదు అంటూ ఈమె గురూజీ త్రివిక్రమ్ పై చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయంలో ఈమె పరోక్షంగా పవన్ పై కూడా సెటైర్స్ వేశారని స్పష్టంగా అర్థం అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…