బాలీవుడ్ ధోనీ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.! ఈ సందర్భంగా టాలీవుడ్, బాలీవుడ్ అనే తారతమ్యం లేకుండా కొందరు సినీ ప్రముఖుల మధ్య డిప్రెషన్ గురించి సోషల్ మీడియాలో తమకెదురైన చేదు సంఘటనలని షేర్ చేసుకుంటున్నారు. తాజాగా ఇదే విషయంపై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలే చేసింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఆయన స్నేహితుడు త్రివిక్రమ్ లను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసేది. కానీ ఇప్పుడు మాత్రం గురూజీ అంటూ డైరెక్ట్ గానే సరిక్రొత్త వివాదానికి తెర లేపింది. టాలీవుడ్ లో గురూజీ అంటే అందరికీ తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్నేహితుడు, మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ ని ఆయన ఫ్యాన్స్ గురూజీ అని సంభోదిస్తుంటారు. అయితే ఇప్పుడు పూనమ్ మాత్రం మీరు గురూజీ కాదు.. మానిప్యులేటర్ అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ఫైర్ అయ్యింది.
“మీవల్ల నా ఫ్యూచర్ పాడైంది. ఒకానొక స్టేజ్ లో సూసైడ్ చేసుకుందామనుకున్నంతగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. ఈ సంగతి కూడా మీకు చెప్పాను. నేను ఛస్తే ఒకరోజు మీడియాలో కనబడతానంతేనంటూ చాలా తేలికగా మీరు మాట్లాడినప్పుడే నాకు జీవితం పై విరక్తి కలిగింది. మీడియా మొత్తం మీ చేతుల్లో వుందనే గర్వంతో మీరిలా స్వార్ధంగా వుండటం కరెక్ట్ కాదు. నా విషయం ప్రక్కన పెడితే.. నీ స్నేహితుడు తను ప్రేమించిన భార్య దగ్గరకి వెళ్లకుండా అడ్డుకున్నావ్. నువ్వు వాళ్ళిద్దరి మధ్యలో రావడం వల్లనే అతను అందరితో తిట్లు తింటున్నాడు. పిల్లలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అతని భార్య బాధ పడుతూనే ఉంది. అతను ఇప్పటికీ బాధ పడుతూనే ఉన్నాడు. ఇదంతా ఎందుకు చేసావ్.. స్లో పాయిజన్ లాగా అతన్ని చంపాలని చూస్తున్నావా.?”
”మీ స్వలాభం కోసం మీ స్నేహితుని జీవితాన్ని మానిప్యులేట్ చేసావ్. మీలాగా అతని లైఫ్ నుండి వేరే ఎవరు కూడా ప్రయోజనం పొందారని నేను అనుకోను. యువర్ మానిప్యులేటివ్.. యూ ఆర్ సిక్” అంటూ వరుస ట్విట్స్ చేసిండి. #guruji హ్యాష్ ట్యాగ్ జత చేసింది. దీంతో త్రివిక్రమ్ పై పూనమ్ కి పీకలదాక కోపం ఉందని తేలిపోయింది. ఆ కోపానికి కారణం ఏమిటన్నది మాత్రం వివరంగా తెలపలేదు. బహుశా.. ఆ మేటరుని కూడా త్వరలోనే బయట పెడుతుందేమో.! ఇంతకీ పూనమ్, గురూజీల మధ్య ఏం జరిగిందని మాత్రం ఆలోచించి బుర్ర పాడుచేసుకోకండి.. సినిమా ఫీల్డ్ అన్నాక ఇవన్నీ సర్వసాధారణమే.!
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…