Featured

Poorna : ఘనంగా ఎంగేజ్మెంట్ చేసుకున్న పూర్ణ… ఫోటోలు వైరల్..!

Poorna : తెలుగులో శ్రీహరి ప్రధాన పాత్రలో నటించిన శ్రీమహాలక్ష్మి సినిమా ద్వారా పరిచయం అయిన పూర్ణ, తరువాత వచ్చిన సీమాటపాకాయ, అవును, సినిమాలలో నటించి ప్రేక్షకులకు చేరువ అయ్యింది. అయితే ఎక్కువసకాలం హీరోయిన్ అవకాశాలు రాకపోయేటప్పటికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడింది ఈ మళయాలి భామ. ఈటీవీలో ప్రసారం అవుతున్న ఢీ ప్రోగ్రాం జడ్జిగా కూడా వ్యవహారించి తెలుగు ప్రేక్షకులకు చేరువ అయ్యింది. ఇపుడు శ్రీదేవి డ్రామా కంపెనీ లో మెరుస్తోంది. ఇక తాజాగా పూర్ణ దృశ్యం 2, సిల్లీ ఫెలోస్, అఖండ, లలో మంచి పాత్రలలో నటించి విజయాలను సొంతం చేసికుంది.

ఇక పూర్ణ ఈ మధ్యనే పెళ్లి చేసుకోబోతున్నాను అని ప్రకటించిన విషయం తెలిసిందే. పూర్ణ యూఏఈ కి చెందిన బిజినెస్ మ్యాన్ షానిద్ అసిఫ్ అలీని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి అందరిని షాక్ కి గురించేసింది. అయితే పూర్ణ – అసిఫ్ ల ఎంగేజ్మెంట్ నిన్న కేరళలో ఘనంగా జరిగింది.

నేను నా ఈ ఫొటోలతో ప్రేమలో పడ్డాను…

నిన్న జరిగిన తన నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను పూర్ణ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. నేను నా ఎంగేజ్మెంట్ ఫొటోలతో ప్రేమలో పడ్డాను. నా జీవితంలోని అందమైన క్షణాలను బంధించినందుకు ధన్యవాదాలు అంటూ క్యాప్షన్‌ తో పూర్ణ తన నిశ్చితార్థం ఫొటోలు, వీడియో తన ఇన్‌ స్టా గ్రామ్‌ లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

షెమీ అఫీషియల్ వారు ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్ లో చాలా అందంగా కనిపిస్తుంది పూర్ణ. అయితే పూర్ణ చేసుకోబోయే అసిఫ్ అలీ జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు సీఈఓ, ఫౌండర్ మాత్రమే కాదు, జమా అల్ మెహరి అనే సంస్థని స్థాపించి… కొత్తగా యూఏఈ లో వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి అవసరమైన సర్వీసును అందిస్తారు. అంతేకాకుండా యూఏఈ మన సెలబ్రిటీలకు గోల్డెన్ వీసా అందించడంలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.

Bhargavi

Recent Posts

24 ఏళ్ల తర్వాత మలుపు… నటి ప్రత్యూష కేసులో నిందితుడు కోర్టులో లొంగింపు

తెలుగు సినీ పరిశ్రమలో రెండు దశాబ్దాల క్రితం సంచలనం సృష్టించిన నటి ప్రత్యూష కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ…

2 hours ago

ఉత్తర కోస్తా నుంచి రాయలసీమ వరకు వర్షాల సూచనలు…….

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే కొన్ని రోజుల్లో వాతావరణ పరిస్థితులు మారే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి…

2 hours ago

గర్భిణీల్లో రక్తహీనతకు కాలుష్యపు పొగ కూడా కారణమా? నిపుణుల హెచ్చరిక..!

గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా ఇళ్లలో కట్టెలు, పిడకలు వంటి సంప్రదాయ ఇంధనాలతోనే వంట చేస్తున్నారు. అయితే ఈ విధంగా…

3 hours ago

కోట శ్రీనివాసరావు సహా భారత లెజెండ్స్‌ను స్మరించిన ఆస్కార్ వేడుక…

అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరంలో ఘనంగా జరిగిన ఆస్కార్ అవార్డులు వేడుకలో భారత సినీ రంగానికి చెందిన పలువురు దిగ్గజాలను…

4 hours ago

ఖతార్ నుంచి వచ్చిన ఎల్‌పీజీ ట్యాంకర్ ‘శివాలిక్’ భారత్ చేరింది

భారత జెండాతో ప్రయాణిస్తున్న ఎల్‌పీజీ ట్యాంకర్ శివాలిక్ ఎల్‌పీజీ ట్యాంకర్ సురక్షితంగా గుజరాత్‌లోని **ముంద్రా పోర్టు**కు చేరుకుంది. ఖతార్ నుంచి…

4 hours ago

సల్మాన్ ఖాన్ కొత్త సినిమాకు భారీ మార్పు… ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’కి కొత్త టైటిల్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించి కీలక మార్పు చోటు చేసుకుంది. మొదట ‘బ్యాటిల్…

6 hours ago