అందంగా జన్మించాలన్న ఒక అదృష్టం ఉండాలని భావిస్తారు. కానీ ఈ నటికి అందం ఆమె పాలిట శాపంగా మారింది. ఈ క్రమంలోనే తన అందమే తనని పెళ్లి పీటలు ఎక్కేలా చేస్తోంది. ఇంతకీ ఆ నటి ఎవరు అనుకుంటున్నారా? ఆమె నటి పూర్ణిమ..అయితే ఈమె నిజంగా నిజజీవితంలో పెళ్లి పీటలు ఎక్కిందనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. ఓ సినిమాలో భాగంగా నటి పూర్ణ పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నటి పూర్ణిమ హీరో అల్లరి నరేష్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత అవును, లడ్డు బాబు, అవును 2 చిత్రాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నప్పటికీ ఈ నటికి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ క్రమంలోనే ఈమె తమిళంలో వరుస అవకాశాలు దక్కించుకొని సుమారు నలభై సినిమాలకు పైగా నటించింది.
తాజాగా పూర్ణిమ ప్రధాన పాత్రలో కల్యాణ్ జీ గోగన దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం “సుందరి”. నిర్మాణ పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేశారు. ఈ ఫోటోలో పూర్ణ పెళ్లి కూతురు గెటప్ లో ఎంతో అందంగా ఉన్నారు.
ఈ సినిమాలో ఎంతో అందంగా ఉన్నటువంటి పూర్ణిమకు తన అందమే శాపంగా మారింది. అయితే ఆమె జీవితం లో ఏం జరిగింది.. అనే కథాంశంతో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు.ప్రస్తుతం పెళ్లి కూతురు గెటప్ లో ఉన్నటువంటి ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…