Featured

జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు.. మారే 10 అంశాలు ఏంటంటే..?

మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. కొత్త సంవత్సరంతో పాటు ఆరోజు నుంచి కొత్త నిబంధనలు సైతం అమలులోకి రాబోతున్నాయి. ఈ కొత్త నిబంధనలు దేశంలోని ప్రజలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపుతున్నాయి. భారతదేశ ప్రజలు ఈ నిబంధనల గురించి తప్పనిసరిగా అవగాహన కలిగి ఉంటే మంచిది. కొత్త రూల్స్ ప్రభావం దేశంలోని చాలామందిపై ఉండనున్న నేపథ్యంలో నిబంధనల గురించి అవగాహన లేకపోతే ఇబ్బందులు పడక తప్పదు.

కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ దేశంలోని నాలుగు చక్రాల వాహనాలను ఫాస్టాగ్ కచ్చితంగా ఉండాలని నిబంధనలు జారీ చేసింది. జనవరి 1వ తేదీ నుంచి ఫాస్టాగ్ ఉన్న వాహనాలను మాత్రమే టోల్ గేట్ల దగ్గర అనుమతించడం జరుగుతుంది. ఆర్బీఐ జనవరి 1వ తేదీ నుంచి 50,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తంలో జరిపే లావాదేవీలకు రీకన్ఫర్మేషన్ ద్వారా మరోసారి వివరాలను వెరిఫై చేసుకుంటుంది.

జనవరి 1వ తేదీ నుంచి కాంటాక్ట్ లెస్ కార్డుల లావాదేవీల పరిమితి 2,000 రూపాయల నుంచి 5,000 రూపాయలకు పెరగనుంది. దీంతో కాంటాక్ట్ లెస్ కార్డుల ద్వారా సులభంగా లావాదేవీలను నిర్వహించడం సాధ్యమవుతుంది. జనవరి 1వ తేదీ నుంచి చిన్న వ్యాపారులు ప్రతి నెలా కాకుండా మూడు నెలలకు ఒకసారి దాఖలు చేసే అవకాశం ఉంది. జనవరి 1వ తేదీ నుంచి కొత్త కార్లు, కొత్త బైకుల ధరలు భారీగా పెరగనున్నాయి.

2021లో ల్యాండ్ లైన్ ఫోన్ నుంచి మొబైల్ ఫోన్ కు కాల్ చేయాలంటే ముందు 0 తప్పనిసరిగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాలం చెల్లిన సాఫ్ట్ వేర్ ఉన్న ఫోన్లలో కొత్త ఏడాదిలో వాట్సాప్ యాప్ పని చేయదు. జనవరి 1వ తేదీ నుంచి దేశంలోని ప్రజలకు ఆరోగ్య సంజీవని పేరుతో పాలసీలు అందుబాటులోకి రానున్నాయి. గతంతో పోలిస్తే యూపీఐ చెల్లింపులు సైతం భారీగా పెరగనున్నాయి. థర్డ్ పార్టీ చెల్లింపులకు ఇకపై అదనపు ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ కు సంబంధించిన నిబంధనల్లో సైతంలో మార్పులు ఉంటాయని సమాచారం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago