దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరిపోయే శుభవార్త చెప్పింది. తక్కువ ధరకే ఇల్లు, స్థలం కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాపర్టీలను కొనుగోలు చేయాలనుకునే వారి కోసం ఎస్బీఐ ఈ నెల 30వ తేదీన మెగా వేలం నిర్వహిస్తోంది. ఈ వేలంలో పాల్గొనడం ద్వారా హోమ్, ఫ్లాట్, షాప్ లను మార్కెట్ రేటుతో పోల్చి చూస్తే చాలా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.
డిసెంబర్ 30వ తేదీన ఆన్ లైన్ మెగా వేలం జరగనుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ ద్వారా ఈ విషయాలను వెల్లడించింది. వేలంపాటకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ వెబ్ సైట్ https://bank.sbi/web/sbi-in-the-news/auction-notices/bank-e-auctions ద్వారా తెలుసుకోవచ్చు. సమీపంలో స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదిస్తే ఈ ఆఫర్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
వేలంలో పాల్గొనే ఆసక్తి ఉండే వాళ్లు ముందుగా కేవైసీ డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. మొదట కొంత డబ్బును డిపాజిట్ చేస్తే మాత్రమే ఈ వేలం పాటలో పాల్గొనవచ్చు. దేశంలోని అగ్రికల్చరల్ ప్రాపర్టీలు, ఇండస్ట్రీయల్, కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాపర్టీలను కూడా ఈ వెబ్ సైట్ ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు. బ్యాంక్ కు వెళ్లి పూర్తి వివరాలు తెలియజేసి ఈ వేలం పాటకు రిజిష్టర్ చేసుకోవచ్చు.
ఎస్బీఐ వేలం ద్వారా ప్రాపర్టీలను కొనుగోలు చేసినా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇల్లు, షాప్ కొనుగోలు చేయాలనే ప్లాన్ ఉన్నవాళ్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా సులభంగా ఈ ప్రాపర్టీలను కొనుగోలు చేయవచ్చు. సమీపంలోని బ్రాంచ్ ను సంప్రదిస్తే ఎస్బీఐ వేలం ప్రక్రియకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుస్తాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…