పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం వకీల్ సాబ్.. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్ కల్యాణ్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మాములుగా లేవు. అంచనాలు ఎలా ఉన్నాయనడానికి తాజాగా విడుదలైన ట్రైలర్ సృష్టించిన, సృష్టిస్తోన్న ప్రభంజనమే సాక్ష్యం. వ్యూస్, లైక్స్ పరంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను, ఇంతకు ముందు టాలీవుడ్ ఇండస్ట్రీలో లేని రికార్డులను ఈ ట్రైలర్ క్రియేట్ చేసింది.
24 గంటల్లో ఈ ట్రైలర్ క్రియేట్ చేసిన రికార్డులను చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. సోమవారం సాయంత్రం 6గంటలకు ఈ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ సినిమా ట్రైలర్ సాధించని రికార్డులను వకీల్ సాబ్ ట్రైలర్ క్రియేట్ చేస్తూ వచ్చింది. గంట గంటకి మిలియన్ల వ్యూస్ పెరుగుతూనే వచ్చాయి. అలాగే లైక్స్ విషయంలో కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ ట్రైలర్‌కు రాని లైక్స్ ఈ ట్రైలర్‌కు రావడం విశేషం. వ్యూస్, లైక్స్ పరంగా.. టాలీవుడ్‌లో ఇప్పుడు వకీల్ సాబ్ ట్రైలర్‌దే టాప్ ప్లేస్ మరియు రికార్డ్. ఈ ట్రైలర్ 24 గంటల్లో.. 22.44 మిలియన్ల వ్యూస్ రాబట్టగా.. 1 మిలియన్ లైక్స్ (23 గంటల 39 నిమిషాల్లో) సాధించి.. పవన్ కల్యాణ్ పవర్ ఏంటో మరోసారి టాలీవుడ్‌కి చూపించేలా చేసింది ‘వకీల్ సాబ్’ ట్రైలర్.
ఆల్రెడీ హిందీలో విడుదలైన సినిమా, అలాగే తమిళ్‌లో రీమేక్ అయిన ‘పింక్’ రీమేక్ ట్రైలర్‌తో ఇటువంటి రికార్డులు సృష్టించడం కేవలం పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కే సాధ్యం అనేలా.. ఇప్పుడు మెగాభిమానులు కాలర్లు ఎగరేస్తున్నారు..ఒక ట్రైలర్ కే ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తే… రేపు సినిమా విడుదలయ్యాక ఇంకెంత రెస్పాన్స్ వస్తుందో.. ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి..!!
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…