Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం ఆది పురుష్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జూన్ 16వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో భారీగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎంతో ఘనంగా నిర్వహించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ వేడుకల్లో ప్రభాస్ చూడ ముచ్చటగా ఉన్నారు. వైట్ అండ్ వైట్ డ్రెస్ ధరించి ప్రభాస్ చాలా అట్రాక్షన్ గా ఉన్నారనే చెప్పాలి. ఇక ఈ వేడుక కోసం ప్రభాస్ ధరించిన ఈ డ్రెస్ అందరినీ ఆకర్షించింది.
ఈ క్రమంలోనే ప్రభాస్ ధరించిన ఈ డ్రెస్ గురించి పెద్ద ఎత్తున అభిమానులు ఆరా తీస్తున్నారు. ప్రభాస్ ధరించిన ఈ డ్రెస్ ఖరీదు ఎంత అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే బాలీవుడ్ సమాచారం ప్రకారం ఈ డ్రెస్ డైరెక్టర్ ఓం రౌత్ ప్రభాస్ కు ప్రత్యేకంగా డిజైన్ చేయించి కానుకగా ఇచ్చారట.
ఇలా తనకోసం స్పెషల్ గా డిజైన్ చేయించి ఇవ్వడంతో ప్రభాస్ ఈ డ్రెస్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వేసుకున్నారని తెలుస్తోంది. ఇక ఈ డ్రెస్ ఖరీదు ఎంత అనే విషయానికి వస్తే ఈ డ్రెస్ ఖరీదు సుమారు పది లక్షల వరకు విలువ చేస్తుందని బాలీవుడ్ సమాచారం.ఇలా ఈ డ్రెస్ ఖరీదు ఇన్ని లక్షల రూపాయలు అని తెలియడంతో ప్రభాస్ అభిమానులు ముక్కున వేలు వేసుకుంటున్నారు.ఇక ఈ డ్రెస్ లో ప్రభాస్ చాలా చూడముచ్చటగా చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారంటూ పలువురు ఈ ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…