Prabhas: నందమూరి నట సింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 కార్యక్రమానికి ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ప్రభాస్ బాలకృష్ణ టాక్ షోలో పాల్గొన్నబోతున్నారని తెలియగానే ఈ ఎపిసోడ్ పై భారీ అంచనాలు పెరిగాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తావనకు తీసుకు వస్తారని అందరూ భావించారు. అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో భాగంగా బాలకృష్ణ ప్రభాస్ పెళ్లి గురించి ప్రశ్నించారు.దీంతో ప్రభాస్ తన పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది.
ప్రభాస్ అందరిని డార్లింగ్ అంటూ పిలవడం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే బాలకృష్ణ కూడా సభాముఖంగా నన్ను కూడా డార్లింగ్ అని పిలవాలని అడుగుతున్నాను అంటే అందుకు ప్రభాస్ సరే డార్లింగ్ సార్ అంటూ బాలకృష్ణని పిలిచారు.ఈ క్రమంలోనే బాలకృష్ణ ప్రభాస్ ను ప్రశ్నిస్తూ గత ఎపిసోడ్లో శర్వానంద్ ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు పెళ్లెప్పుడు చేసుకుంటావు అని అడగడంతో ప్రభాస్ చేసుకున్న తర్వాతే చేసుకుంటా అని సమాధానం చెప్పాడు.
మరి మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు అని బాలకృష్ణ ప్రశ్నించడంతో అందుకు ప్రభాస్ సమాధానం చెబుతూ… నేను సల్మాన్ ఖాన్ చేసుకున్న తర్వాత చేసుకుంటానని చెప్పాలేమో అంటూ తన పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. మొత్తానికి ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ కావడంతో అభిమానులు సైతం పూర్తి ఎపిసోడ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…