Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి దీపికా పదుకొనే నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా గురించి ప్రభాస్ ఒక ఇంటర్నేషనల్ మీడియాతో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ప్రభాస్ కి దీపిక గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా ప్రభాస్ దీపికా పదుకొనే గురించి మాట్లాడుతూ… దీపికా పదుకొనే చాలా పెద్ద సూపర్ స్టార్ అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించారు.
దీపిక చాలా అందమైన అమ్మాయి, ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా తన సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఇంటెర్నేషనల్ బ్రాండ్స్ కి యాడ్స్ చేసింది, అంబాసిడర్ గా కూడా ఉంది. సెట్ కి దీపికా వచ్చినప్పుడు అందరికి ఉత్సాహం వస్తుంది. తనతో ఎప్పట్నుంచో వర్క్ చేయాలనుకున్నాననీ తెలిపారు.తనతో కలిసి తాను చేస్తున్నది మొదటి సినిమా ఇదేనని ఈయన తెలిపారు.
దీపికా పదుకొనేని ఒక నటిగా తాను ఎంతో ఇష్టపడతాను అంటూ ఆమె పట్ల ప్రభాస్ ప్రశంసిస్తూ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీపిక పదుకొనే ఇప్పటికే ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. అయితే ఈమె నటించిన సినిమాలు తెలుగులో కూడా విడుదల కావడంతో ఇక్కడ కూడా ఈమెకు భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. అయితే ప్రభాస్ సరసన ఈమె మొదటిసారి తెలుగు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
భారతీయ జీవన విధానంలో నేలపై కూర్చుని భోజనం చేయడం ఒక పాత సంప్రదాయం. పూర్వం నుంచి పెద్దలు ఈ అలవాటును…
సీనియర్ నటుడు నరసింహరాజు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితం, అలాగే గతంలో తనపై వచ్చిన…
హైదరాబాద్ నగర ప్రజలకు త్వరలోనే మరో సౌకర్యం అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెల్లవారుజామున ప్రయాణాలు చేసే వారికి…
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది లక్షలాది మందిని ప్రభావితం చేసే తీవ్రమైన వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ముఖ్యంగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వంటి…
ఇంట్లో చిన్న మొక్కలు పెంచుకోవడం ఇప్పుడు అలవాటుగా మారింది. అందులో ముఖ్యంగా Money Plantకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ…
మన వంటింట్లో సాధారణంగా ఉపయోగించే కూరగాయల్లో ఎన్నో పోషకాలు దాగి ఉంటాయి. అయితే వాటిలోని కొన్ని భాగాలను మనం పట్టించుకోకుండా…