సినీ నటి ప్రగతి.. ప్రత్యేక పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తల్లిగా, పిన్నిగా, వదినగా, అత్తగా ఇలా అనేక రకాల పాత్రల్లో తనదైన స్టైల్లో నటించి అభిమానుల హృదయాలలో స్ధానం సంపాదించుకుంది. ఏ క్యారెక్టర్ ఇచ్చిన అందులో ఒదిగిపోతుంది. తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇక స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువగా కనించే ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకంటే డబుల్ వయసు ఉన్న హీరోలకు తన కంటే ఎక్కువ వయసు ఉన్న హీరోయిన్స్ కు కూడా అమ్మ పాత్రల్లో నటించింది. ఓ సినీ నటిగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఎప్పుడు చాలా పద్దతిగా ఉండే పాత్రల్లో కనిపించే ప్రగతి సోషల్ మీడియాలో మాత్రం చాలా ట్రెండీగా.. మోడ్రన్ డ్రస్ లతో అందర్నీ అలరిస్తూ అదరగొట్టేస్తుంది.
లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ప్రగతి ఫిట్ నెస్‌పై ఫోకస్ పెట్టింది. ప్రతి రోజు రకరకాల వర్కవుట్స్ చేస్తోంది. తీరిక సమయాలలో సోషల్ మీడియాలో తన వీడియోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ఫొలోయింగ్ ను సంపాదించుకుంటుంది. ఆ మధ్యకాలంలో తమిళ్ విజయ్ మాస్టర్ సినిమా సాంగ్ కి లుంగిలో తీన్మార్ స్టెప్పులు వేసి అందర్నీ అలరించింది. ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. తాజాగా మరో వీడియోతో సోషల్ మీడియాను షేక్ చేసింది ప్రగతి సినిమాలలో అమ్మగా, అమ్మమ్మగా కూడా నటించిన ప్రగతిని స్లీవ్ లెస్ టీ షర్ట్ మరియు టైట్ ఫ్యేంట్ లో చూసిన ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఈమె నిజంగా ప్రగతియేనా.? అన్నట్లుగా ఆశ్చర్యపోతున్నారు. విజయ్ మాస్టర్ మాస్ సాంగ్ వీడియో గురించి నెటిజన్లు మర్చిపోకముందే మరోసారి ఈ వీడియోతో ప్రగతి చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. ఈ వీడియోలో కూడా నడుము ఊపుతో డాన్స్ చేసింది. నాట్ ఏ బ్యాడ్ ట్రై అంటూ ఈ వీడియోకు కామెంట్ పెట్టి మరీ పోస్ట్ చేసింది.
ప్రగతి వయసు 44 ఏళ్ళు. అయినా సరే యువ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని ఎనర్జీతో దూకుడుతో ముందుకెళ్తోంది ఈ ఆంటీ. ప్రగతి బాడీలో ఇంత రిథమ్ చూసి ఫాలోవర్స్ సైతం షాక్ అవుతున్నారు. 4 పదుల వయసులో కూడా తన అందచందాలతో అందర్నీ ఆకర్షిస్తున్న ప్రగతి వీలైనంత వరకు అందంగా కనిపించడానికే ఎక్కువగా ఇష్టపడుతుందని ఈ లేటెస్ట్ వీడియో ద్వారా తెలుస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…