Prakash Raj: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే పఠాన్ సినిమాల్లో నటించి పెద్ద ఎత్తున వివాదాలలో చిక్కుకున్నారు. ఈ సినిమాలో ఎక్కువగా ఈమె బికినీ ధరించే సందడి చేయడంతో ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు ఈమె వ్యవహార శైలి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా ఈ సినిమాలో బేషరమ్ పాట విడుదలైన అనంతరం ఈ వివాదం ముదిరిపోయింది. ఈ క్రమంలోని సోషల్ మీడియా వేదికగా ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున హాస్టగ్ ట్రెండ్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో దీపిక పదుకొనేకు మద్దతుగా నటుడు ప్రకాష్ రాజ్ నిలబడ్డారు. ఈ సందర్భంగా ఆయన ఎప్పటికప్పుడు ఈ సినిమాకి మద్దతు తెలుపుతూ వస్తున్నారు.
తాజాగా ఈ విషయంపై మరోసారి స్పందించిన ప్రకాష్ రాజ్ గతంలో దీపికా పదుకొనే ఫీఫా వరల్డ్ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన ఫొటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసి తనకు మద్దతు తెలిపారు. అదే విధంగా ఈ ఫోటోని షేర్ చేస్తూ నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. నీ విషయంలో ఈ బిగోట్స్ ఇప్పుడు ఫిఫా వరల్డ్ కప్ ని బ్యాన్ చేస్తారా!’ అని రాసుకోచ్చారు.
ఫిపా వరల్డ్ కప్ ఫైనల్ కి ముందు దీపిక ట్రోఫీని ఆవిష్కరించింది. అయితే ఇలా ఫిఫా చరిత్రలో ఇలా ఓ నటికి ట్రోఫీని లాంచ్ చేసే అవకాశం రావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇలాంటి అవకాశం భారతదేశానికి దక్కిన ఓ గొప్ప అవకాశం అని చెప్పాలి అంటూ ప్రకాష్ రాజ్ దీపికా పదుకొనేకు పూర్తిగా తన మద్దతును తెలియజేశారు.ఇకపోతే ఈ సినిమా జనవరి 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా పెద్ద ఎత్తున వివాదాలను ఎదుర్కొంటుంది.
చైనాలో సిమ్ కార్డుల నుంచి బంగారం – నెటిజన్ల ఆశ్చర్యం చైనాలోని క్యో అనే వ్యక్తి ఇటీవల సోషల్ మీడియాలో…
ప్రపంచంలో అత్యంత చవక పెట్రోల్, భారత్ పరిస్థితి భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గత కొన్ని సంవత్సరాల్లో భూకంపంలా పెరుగుతున్నాయి.…
ప్రేమికుల రోజు: గిఫ్ట్‌లు, కేకులు, ఆనందం ప్రతి ఏడాది ఫిబ్రవరి 14 వ తేదీ ప్రపంచంలోనూ, తెలుగు రాష్ట్రాలనూ ప్రేమికుల…
తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. రాజమహేంద్రవరం,…
వెండి, బంగారం ధరల్లో ఇటీవల కనిపిస్తున్న హెచ్చుతగ్గులు మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారాయి. గత కొన్ని వారాలుగా పసిడి, వెండి రేట్లు…
రంజాన్ సీజన్ ప్రారంభం, హలీం సందడి రంజాన్ మాసం ప్రారంభమయ్యింది. హైదరాబాద్ సహా దేశంలోని పలు నగరాల్లో హలీం విందుల…