Movie News

Rakesh Master -Prabhu Deva: ఢీ డాన్స్ షోలో ప్రభుదేవాకే సవాల్ విసిరిన రాకేష్ మాస్టర్… అసలేం జరిగిందంటే?

Rakesh Master -Prabhu Deva: సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్లుగా ఎంతోమంది చలామణి అవుతున్నారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ చేస్తున్నటువంటి జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ వంటి ఎంతో అద్భుతమైన కొరియోగ్రాఫర్లను తీర్చిదిద్దిన ఘనత రాకేష్ మాస్టర్ కి చెల్లుతుందని చెప్పాలి వీరందరూ కూడా రాకేష్ మాస్టర్ దగ్గర శిష్యరికం చేసినవారే.

ఇలా రాకేష్ మాస్టర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సుమారు 1500 సినిమాలకు కొరియోగ్రఫీ చేశారు. ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలు అందరికీ కొరియోగ్రఫీ అందించారు.ఇలా ఒకానొక సమయంలో కొరియోగ్రాఫర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాకేష్ మాస్టర్ ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలలో పాల్గొని పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ వివాదాలలో నిలబడ్డారు.

ఇకపోతే ఒకప్పుడు రాకేష్ మాస్టర్ ఇలా ఉండే వారు కాదు. ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా ఎంతో పేరు సంపాదించుకున్నటువంటి ప్రభుదేవాకు ఈయన సవాల్ విసిరారు. ఢీ షో మొదలవుతున్న రోజులలో ఈ కార్యక్రమానికి జడ్జిలుగా తరుణ్ మాస్టర్, బృందా లాంటి మేటి కొరియోగ్రాఫర్లు వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఈ షో కి ప్రభుదేవా కూడ వచ్చారు.

Rakesh Master -Prabhu Deva: తెలుగు తెలిసిన వారే జడ్జిగా ఉండాలి..


ఈ క్రమంలోనే రాకేష్ మాస్టర్ ప్రభుదేవాకు ఈ షోలో సవాల్ విసిరారు. తెలుగు తెలిసిన వారు మాత్రమే ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణయితలుగా ఉండాలని, తెలుగు వచ్చిన వాళ్లే ఈ కార్యక్రమంలో పాల్గొని మన దమ్ము చూపించాలని అప్పట్లో ప్రభుదేవాకు సవాల్ విసిరాడు. అయితే ఇలాంటి కార్యక్రమాలలో తెలుగువారికి అవకాశం కల్పించి వారికి కూడా ఇండస్ట్రీలో చోటు కల్పించాలని ఉద్దేశంతోనే రాకేష్ మాస్టర్ అప్పట్లో ప్రభుదేవాతో చాలెంజ్ విసిరారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

2 days ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

2 days ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

2 days ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

2 days ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

2 days ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

2 days ago