Ram Gopal Varma : వివాదాలతో బతికే జీవి ఆర్జీవి. ఏదో ఒక ఒకవిషయంలో కాంట్రావెర్సీ క్రియేట్ చేసి తనని తాను ప్రమోట్ చేసుకుంటూ ఉండే ఆర్జీవి, సినిమాకు ప్రమోషన్స్ వింతగా చేసే ఆర్జీవి తాను తీసిన సినిమాలను జనాలు ఎపుడో మర్చిపోయినా తాను చేసే, మాట్లాడే కాంట్రావెర్సీల కోసం మాత్రమే ఎదురుచూస్తుంటారు. అయితే ఇదంతా ఇప్పుడు, ఒకప్పుడు వర్మ వేరు. తెలుగు సినిమాకు కొత్త ట్రెండ్ ను తెచ్చిన ట్రెండ్ సెట్టర్ వర్మ. ‘శివ’ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ సినిమా తీరును మార్చేశాడు. స్టడీ కెమెరా ను వాడి సినిమా విజువల్స్ కి కొత్తదనం తీసుకోచ్చి అలానే సినిమా పంథాను మార్చి అందరినీ ఆకర్శించాడు వర్మ. ఇక శివ సినిమా గురించి ఎవరికీ తెలియని సీక్రెట్స్ వర్మ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
ఇప్పటికీ ఎవరికీ తెలియదు… నా భార్యకు నా విలువ అప్పుడు తెలిసింది…
శివ సినిమా కోసం అందరికీ సీన్స్ చెప్పి ఇంప్రెస్స్ చేసిన వర్మ అసలు సినిమా నేను అనుకున్నట్లు తీయగలనా లేదా అనే అనుమానం వచ్చిందట. షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వక ముందే సీరియల్ ఆర్టిస్ట్ ఒకరిని హీరోగా పెట్టి ఒక సీన్ ట్రై చేసాడట. అయితే పరమ చెత్తగా రావడంతో తీసిన వీడియో ఫుటేజ్ నాశనం చేసాడట ఆర్జివి, కానీ సినిమా మాత్రం బాగా వచ్చింది, అలా ఎలా జరిగిందో అంటూ అప్పటి సీక్రెట్ చెప్పాడు వర్మ. అయితే ఆ సీరియల్ ఆర్టిస్ట్ కు నువ్వే సినిమాలో హీరో అని శివ నాగేశ్వరావు చెప్పి పిలుచుకోచ్చాడట. నిజంగా అనుకుని వచ్చిన ఆ సీరియల్ ఆర్టిస్ట్ ఎవరో కాదు వినోద్ బాలా.
ఇక వర్మ సినిమా పూర్తయి థియేటర్ లో మొదటి రోజు అసలు విజిల్స్ కానీ కేకలు కానీ లేకుండా నిశ్శబ్దంగా ఉండేసరికి సినిమా పోయింది అని అన్నపూర్ణ కాంపౌండ్ లోని అందరూ భావించారట. అయితే ఒక మూడు రోజుల తరువాత అర్థమైందట సినిమా చూసి అందరూ స్టన్ అయ్యారు అని. ఇక చాలా బిజీగా ఉండి ఎక్కడో తిరుగుతున్నాడని వర్మ భార్య ఆయన మీద చాలా కోపంతో ఉండేదట. అయితే శివ సినిమా చెన్నై లో చూసాక వర్మ గురించి అర్థమైందట. అది ఇది అంటుంటాడు, తిరుగుతున్నాడు కానీ ఇంత మంచి సినిమా తీయగలడా అని వర్మ గొప్పతనం ఆరోజు తెలిసిందట రామ్ గోపాల్ వర్మ భార్యకు, శివ సినిమా షూటింగ్ ముచ్చట్ల గురించి చెబుతూ వర్మ ఎవరికీ ఇంతవరకు తెలియని ఈ సీక్రెట్స్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…