Categories: FeaturedMovie News

Prakash Raj: పవన్, మహేష్ సినిమా డైలాగులపై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు.. చండాలంగా ఉందంటూ?

Prakash Raj: సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు ప్రకాష్ రాజ్ ఒకరు. ఈయన ఇండస్ట్రీలో ఎంతో మంచి నటుడిగా ఎన్నో అవార్డులను పురస్కారాలను అందుకున్నారు ఒక విలక్షణ పాత్రలో నటించాలన్న ఒక మంచి తండ్రి పాత్రలో నటించాలన్న ప్రకాష్ రాజుకు ఎవరు తీసిపోరు. ఇప్పటికే ఎన్నో సినిమాలలో విలన్ గా నటించి తనలో ఉన్న విలనిజం అందరికీ పరిచయం చేశారు.

ఇక తండ్రి తాత పాత్రలలో కూడా నటిస్తూ ప్రకాష్ రాజ్ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈయన స్టార్ హీరోలు అందరి సినిమాలలో నటించారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు పవన్ కళ్యాణ్ వంటి స్టార్ సినిమాలలో కూడా ప్రకాష్ రాజ్ నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ప్రకాష్ రాజ్ మహేష్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలోని డైలాగ్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మహేష్ బాబు ప్రకాష్ రాజు కాంబినేషన్లో వచ్చిన ఒక్కడు చిత్రం అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. ఈ సినిమా మొత్తం నేను మహేష్ భూమిక మా ముగ్గురి మధ్య తిరుగుతూ ఉంటుందని తెలిపారు. ఇక ఈ సినిమాలో తను సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొబ్బెమ్మను నేను రా అని చెప్పే డైలాగ్ తనకు చాలా బాగా నచ్చిందని ప్రకాష్ రాజ్ వెల్లడించారు.

ఇక పవన్ కళ్యాణ్ నటించిన సుస్వాగతం సినిమాలో కూడా ప్రకాష్ రాజ్ హీరోయిన్ తండ్రి పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఇందులో కూడా ఈయన నేను మోనార్క్ ను నన్ను ఎవరు మోసం చేయలేరు అనే డైలాగ్ చాలా ఫేమస్ అయ్యింది. అయితే డైరెక్టర్ ఈ డైలాగ్ తనకు చెప్పినప్పుడు ఇదేంటండి ఇంత చెత్తగా ఉంది అసలు ఈ డైలాగ్ మార్చండి అని నేను చెప్పాను.

నేను మోనార్క్.. నన్ను మోసం చేయలేరు
ఇక డైరెక్టర్ ఒప్పుకోకపోవడంతో చెప్పాల్సిన పరిస్థితిని ప్రకాష్ రాజ్ వెల్లడించారు.కానీ సినిమా విడుదలైన తర్వాత ఈ డైలాగు చాలా పాపులర్ అయిందని ఎవరి నోట చూసిన ఇదే డైలాగ్ రావడంతో నా నిర్ణయం తప్పని వెళ్లి డైరెక్టర్ కు క్షమాపణలు చెప్పాను అంటూ ప్రకాష్ రాజ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago