Prasanna Kumar : కుప్పం పాదయాత్రకు వెళ్లి గుండె పోటు రావడంతో నారాయణ హృదయాలయలో 23 రోజులుగా మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరకు శివరాత్రి రోజున మరణించారు. ఆయన మరణం ఆయన కుటుంబాన్నే కాకుండా తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు అలాగే తెలుగు ప్రజలను బాధకు గురిచేసింది. ఇక ఆయన ఈమధ్యనే మళ్ళీ పాలిటిక్స్ లో బిజీ అవుతున్నారు, ఈసారి ఎమ్మెల్యే గా గెలిచి రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. అందుకోసం సిద్ధపడుతున్న సమయంలో ఇలా అనంతలోకాలకు వెళ్లిపోయారు. అయితే తారకరత్న మరణం తరువాత ఆయన కుటుంబం గురించి ఎక్కువగా సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. నందమూరి కుటుంబాన్ని ఏదో శాపం వెంటాడుతోంది అంటూ కొన్ని వార్తలు వైరల్ అవుతున్న సమయంలో వాటి గురించి నందమూరి ఫ్యామిలీ కి సన్నిహితుడైన ప్రసన్న కుమార్ గారు మాట్లాడారు.
అలేఖ్య కి తారక్ కి గొడవలు…
ప్రసన్న కుమార్ గారు మాట్లాడుతూ భార్య భర్తలన్నాక ఇంట్లో చిన్న చిన్న గొడవలు అందరికీ ఉంటాయి అయితే తారకరత్న అలేఖ్య ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అంతమాత్రాన వాళ్ళ మధ్య గొడవలు రావు అనడానికి లేదు. అయితే వాళ్లిద్దరూ విడిపోవాలనుకునేంత గొడవలు లేవు, ఒకవేళ గొడవలు ఉంటే ముగ్గురు పిల్లలు పుట్టారు కదా అంటూ ప్రసన్న గారు అభిప్రాయపడ్డారు. ఇక నందమూరి వారు కులదేవతను పూజించాలని తారకరత్న కు చికిత్స జరుగుతున్న సమయంలో బెంగళూరు లో చెప్పారు.
అయినా విధి రాతను ఎవరూ మార్పించలేరు. అలేఖ్య జాతకంలో భర్త వియోగం లేదా విడాకులు అని ఉంది, అలా ఉంది ఇలా ఉంది అంటూ వస్తున్న వార్తలన్నీ అపద్దాలే. ఇద్దరూ సంతోషంగా కుటుంబాన్ని నడుపుతూ ఉండగా ఇలా విధి తారకరత్న ను తీసుకుపోయింది. అది ఎవరూ మార్చలేరు కదా అంటూ ఆయన అభిప్రాయపడ్డారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…