Rocking Rakesh: రాకింగ్ రాకేష్ పరిచయం అవసరం లేని పేరు.జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనంతరం జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా సందడి చేస్తున్నటువంటి జోర్దార్ సుజాత ప్రేమలో పడ్డారు. ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట ఎట్టకేలకు ఏడుకొండలవాడు సన్నిధిలో వివాహం చేసుకొని ఒకటయ్యారు.ఇలా వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇకపోతే అసలు జోర్దార్ సుజాత రాకింగ్ రాకేష్ మధ్య ప్రేమ ఎలా చిగురించిందనే విషయాన్ని రాకింగ్ రాకేష్ ఒకానొక సందర్భంలో తెలియచేశారు. ఈ సందర్భంగా తమ ప్రేమ గురించి మాట్లాడుతూ… నేను సుజాత మంచి స్నేహితులం కావడంతో దర్శకుడు శ్రీపాద సుజాతను జబర్దస్త్ కార్యక్రమంలోకి తీసుకురావాలని కోరారు. ఆయన చెప్పడంతో సుజాతను జబర్దస్త్ కార్యక్రమానికి పరిచయం చేశానని తెలిపారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మేమిద్దరం కలిసి లవ్ స్కిట్లలో నటించడంతో లవ్ సింబల్స్ వేశారు దీంతో అది మా ఇద్దరి విషయంలో బాగా వర్క్ అవుట్ అయిందని మాకు తెలియకుండానే ప్రేమలో పడిపోయామని తెలిపారు. ఇలా నా వర్కింగ్ పార్ట్నర్ నా లైఫ్ పార్టనర్ అవుతుందని అనుకోలేదు.
ఈ విధంగా మేమిద్దరం ఒకరికి తెలియకుండానే మరొకరు ప్రేమలో పడ్డామని అయితే ప్రేమలో ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఇద్దరం ఒకరికొకరు ఎప్పుడు కూడా ఐ లవ్ యు చెప్పుకోలేదు అంటూ ఈ సందర్భంగా రాకింగ్ రాకేష్ తమ ప్రేమ గురించి తెలియజేశారు. ఇక గత నెలలో నిశ్చితార్థం జరుపుకున్నటువంటి ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇలా వీరి పెళ్లి ఫోటోలు వైరల్ కావడంతో ప్రతి ఒక్కరు జీవితాంతం ఇలాగే సంతోషంగా ఉండాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…