Featured

Prathyusha : ప్రత్యూష ని నాలుగు, ఐదు గెస్ట్ హౌస్ లు మార్చి అత్యాచారం చేశారు : సరోజినీ దేవి

Prathyusha : చిన్న పాత్రతో సినిమాల్లోకి అడుగుపెట్టిన తెలుగమ్మాయి ప్రత్యూష అనతి కాలంలోనే మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కలుసుకోవాలని, స్నేహమంటే ఇదేరా వంటి సినిమాల్లో నటించిన ప్రత్యూష తమిళం వంటి ఇతర భాషల్లోనూ హీరోయిన్ గా అవకాశాలు అందుకుని కెరీర్ లో ముందుకు అడుగులేస్తున్న సమయంలో అర్థాంతరంగా మరణించింది. అనుమానస్పదంగా ప్రత్యూష మరణిస్తే ఆమె తల్లి సరోజినీ దేవి ఆమెకు న్యాయం జరగాలని ఇప్పటికీ పోరాడుతున్నారు. ఎన్నోసార్లు కేసులో వెనక్కి తగ్గాలని భయపెడుతూ ఫోన్స్ వచ్చాయంటూ చెప్పిన సరోజినీ గారు ఎక్కడా పోరాటం ఆపలేదంటూ చెప్పారు. కానీ కూతురు చనిపోయి ఇరవై ఏళ్ళు దాటిపోయినా న్యాయం మాత్రం జరగలేదని బాధపడ్డారు.

నాలుగు, ఐదు గెస్ట్ హౌస్ లు మారుస్తూ అత్యాచారం చేశారు…

ప్రత్యూష, తమ ప్రియుడు సిద్ధార్థరెడ్డి తో కలిసి విషం తాగి మరణించాలని భావించారు. అయితే ప్రత్యూష మరణించింది సిద్ధార్థరెడ్డి బ్రతికాడు, ఇది బయటికి చెబుతున్న విషయంలో కానీ నిజానికి ప్రత్యూష మీద అత్యాచారం జరిగిందని వార్తలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఇక ఈ విషయంలో గురించి ప్రత్యూష తల్లి సరోజినీ దేవి మాట్లాడుతూ ఆఫ్ రికార్డు ఎంక్వయిరీ చేసినపుడు సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల సమయంలో దాదాపు నాలుగు ఐదు గెస్ట్ హౌస్ లు మారుతూ సిద్ధార్థరెడ్డి అతని గ్యాంగ్ అత్యాచారం చేసారు.

చివరి గెస్ట్ హౌస్ కి వెళ్లేసరికి ప్రత్యూష ఆపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. అందరూ కలిసి సిద్ధార్థను ముందుకు పెట్టి తప్పించుకున్నారు. సిద్ధార్థ రెడ్డి నోరువిప్పితే అందరూ బయటికి వస్తారు. అతను ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యాడు, పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అతనికి ఎవరెవరు అత్యాచారం చేసారని చెప్పాల్సిన అవసరం లేదు కదా, దేవుడే వారిని శిక్షిస్తాడు కన్న తల్లిగా నాది అరణ్య రోధన అంటూ చెప్పారు సరోజినీ దేవి.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago