Featured

L. B. Sriram : మా అమ్మాయి అప్పగింతలు… చిరంజీవి చెల్లెలు అప్పగింతలు మర్చిపోలేనివి : ఎల్బి శ్రీరామ్

L. B. Sriram : కమెడియన్ గా అందరికీ బాగా తెలిసిన ఎల్బి శ్రీరామ్ గారు మంచి హాస్యానటుడే కాదు గొప్ప రైటర్ కూడా. ఆయన డైలాగు రైటర్ గా సినిమాలకు పనిచేసారు. విభిన్నమైన డైలాగు డెలివరీతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ గారు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఆయన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే బ్యానర్ మీద షార్ట్ ఫిలిమ్స్ ను తీస్తున్నారు. సినిమాల్లో ఇస్తున్న మూస పాత్రలను చేయడం ఇష్టం లేక వాటి నుండి తప్పుకున్నాను అంటూ శ్రీరామ్ చెప్పారు. ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తూ సినిమాల్లో అవకాశాల కోసం కష్టపడిన ఎల్బి శ్రీరామ్ గారు ప్రస్తుతం ‘కవి సామ్రాట్’ అనే షార్ట్ ఫిల్మ్ ను ఆహా ఒరిజినల్స్ లో చేశారు. ఇక నిజజీవితంలో ఆయన కూతురు అప్పగింతల సందర్బం మర్చిపోలేనని, చాలా ఏడ్చేసానని చెప్పారు.

ఆ సినిమాలో డైలాగులు ఎప్పటికీ మర్చిపోలేను…

శ్రీరామ్ గారు కూతురు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. చదువుకునే సమయంలో కూడా స్కూల్ దగ్గర ఉంటే మేలు అనే ఉద్దేశంతో ఉద్యోగం స్కూల్ దగ్గరగా ఉండే ఏరియా కు బదిలీ చేయించుకునేవారట. ఇక కూతురు దగ్గరగా ఉండాలని హైదరాబాద్ సంబంధం చూసి చేశారట. అయితే పక్క వీధిలోనే తను ఉంటుంది, పొద్దున లేస్తే కూతురును చూసి రావొచ్చని తెలిసినా అప్పగింతలపుడు చాలా ఏడుపొచ్చింది ఎవరైనా చూస్తే ఓవర్ యాక్షన్ అంటారని భయమేసింది. చాటుకు వెళ్లి ఎవరూ లేని చోటా ఏడ్చేసాను ఆ సంఘటన మర్చిపోలేను అంటూ చెప్పారు. ఇక అలాంటి సంఘటన ‘హిట్లర్’ సినిమా సమయంలో బాగా గుర్తుండిపోయింది.

ఆ సినిమాలో పెద్ద చెల్లెలు పెళ్లి చేసి పంపే సమయంలో అన్నగా చిరంజీవి అప్పగింతల సమయంలో వచ్చే ఎమోషనల్ సీన్ రచయితగా చాలా ఇష్టం. హీరో ఎక్కువ మాట్లాడడు సినిమాలో అందుకే అప్పగింతల సమయంలో ఎక్కువ మాట్లాడితే బాగోదు అందువల్ల చెల్లితో ఎక్కువ మాటాడించి చివర్లో అన్నగా కలెక్టర్ ను ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి పరిస్థితుల వల్ల రెండో పెళ్లి వాడికి ఇచ్చి పెళ్లి చేయాల్సి వచ్చినందుకు హీరో చెప్పే పవర్ ఫుల్ డైలాగు రెండు లైన్స్ అయినా ఆకట్టుకుంటుంది. ఆ సీన్ డైలాగులు హీరో కి డైరెక్టర్ కు నచ్చుతాయో లేదో అనుకున్నాను కానీ చిరంజీవి గారు షూటింగ్ లో ఆరోజంతా నన్ను పొగిడారట, చాలా ఆనందంగా అనిపించింది. ఈ రెండు సంఘటనలు జీవితంలో మరువలేను అంటూ ఎల్బిశ్రీరామ్ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago