Featured

Producer M.S. Raju : మహేష్ బాబు వద్దన్నాడు… గుణశేఖర్ మహేష్ బాబుతో వివాదం… సిద్ధార్థను హీరోగా పెట్టినందుకు అందరూ ఎగతాళి చేశారు : నిర్మాత ఏంఎస్ రాజు

Producer M.S. Raju : ఒక్కడు, వర్షం, నువ్వొస్థానంటే నేనొద్ధంటానా అంటూ వరుస హ్యాట్రిక్ లు కొట్టిన నిర్మాణ సంస్థ సుమంత్ ఆర్ట్స్. ఇక ఏంఎస్ రాజు గారు కేవలం నిర్మాత అంటే డబ్బు పెట్టడం అన్నట్లు కాకుండా సినిమా ప్రతి విషయంలోనూ పర్యవేక్షిస్తారు. వరుసగా మూడు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుని రికార్డు క్రియేట్ చేసారు. ‘వాన’ సినిమా తరువాత రాజుగారి దూకుడు తగ్గిపోయింది. ఇక డైరెక్టర్ గా కూడా సినిమాలను తీసిన ఆయన లాక్ డౌన్ సమయంలో ‘డర్టీ హరి’ అంటూ సినిమాను డైరెక్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. ప్రస్తుతం కొడుకు కోసం ఒక సినిమా చేసిన ఆయన తన సినిమా కెరీర్ గురించి మాట్లాడారు.

మహేష్ తో నాకు ఇష్యూ లేదు… సిద్ధార్థ హీరో అంటే అందరూ నవ్వారు…

‘ఒక్కడు’ సినిమా సమయంలో మహేష్ సక్సెస్ లో లేడు, నేను సక్సెస్ లో లేను దీంతో సినిమా బడ్జెట్ విషయంలో మహేష్ ఎక్కువ బడ్జెట్ వద్దని చెప్పాడు. కానీ నేను కంప్రమైస్ అవ్వడం ఇష్టం లేక బడ్జెట్ పెట్టాను. మొదటిసారి డైరెక్టర్ కథతో వెళ్లడం ఒక్కడు సినిమాతో జరిగింది. గుణశేఖర్ కథను మహేష్ వినమంటే విని ఒకే చేసాము. చిన్న చిన్న మార్పులు మామూలే కానీ సినిమా చక్కగా వచ్చింది. వాళ్లిద్దరితో నాకెలాంటి వివాదాలు లేవుఅంటూ వివరించారు రాజు గారు. ఇక ప్రభాస్ తండ్రికి మాటివ్వడం వల్ల వర్షం సినిమా చేసానని, ఆ తరువాత మళ్ళీ ప్రభాస్ ఇంకో సినిమా చేద్దామని అడిగినా ‘నువ్వొస్తానంటే నేనొద్ధంటనా’ ఆల్రడీ రెడీ చేసుకోవడం వల్ల మళ్ళీ చేద్దామని చెప్పాను, ఇక రాజమౌళితో తాను సినిమా కమిట్ అయ్యాడు.

సిద్ధార్థ హీరోగా ప్రభుదేవాను డైరెక్టర్ గా ఆ సినిమా ప్లాన్ చేసాం. సిద్ధార్థ హీరో అనగానే పరుచూరి బ్రదర్స్ ఆ జుట్టు ఏంటి ఆ హీరో అంటూ నవ్వేవాళ్ళు, ఇక పోస్టర్స్ చూసాక చాలా మంది అమ్మాయిలా ఉన్నాడు హీరో ఏంటి అంటూ మాట్లాడారు. ప్రభుదేవా డైరెక్టర్ అనగానే రాజుకి బాగా బలుపు ఎక్కువైంది అందుకే రెండు హిట్లు వెంటనే రాగానే ఇలా ఇష్టమొచ్చినట్లు చేస్తున్నాడని విమర్శించారు. కానీ ఆ సినిమా హిట్ అయ్యాక త్రిషా, సిద్ధార్థ, ప్రభుదేవా కెరీర్ మారిపోయింది అందరూ ముందుకెళ్లిపోయారు. ఆలోచిస్తే నేను మాత్రమే కెరీర్ లో వెనుకబడ్డానేమో అంటూ నవ్వుతూ చెప్పారు ఏంఎస్ రాజు గారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago