Jr. NTR -Mehar Ramesh: మెహర్ రమేష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్లాప్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 153 వ సినిమా భోళా శంకర్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులను ప్రారంభం చేసుకుంది. ఇకపోతే మెహర్ రమేష్ తన సినీ కెరియర్లో చేసిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ సినిమాలు గానే మిగిలిపోయాయి.
బిల్లా సినిమా మినహా ఎన్టీఆర్ తో ఈయన చేసిన కంత్రి, శక్తి సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి.ఈ క్రమంలోనే ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ మెహర్ రమేష్ మధ్య దూరం పెరిగిందనే వార్తలు వినిపించాయి. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మెహర్ రమేష్ కు ఇదే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నలకు మెహర్ రమేష్ ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు.
ఈ క్రమంలోనే ఈయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ నటించిన కంత్రి సినిమా హిట్ అయింది అంటూ సమాధానం చెప్పారు. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ కి మించి వసూలు వచ్చాయని అమెరికాలో యమదొంగ సినిమా కన్నా మంచి వసూలు రాబట్టిందని తెలిపారు. ఇక శక్తి సినిమా అనుకున్నంత స్థాయిలో రాలేదని అయితే ఆ సమయంలో ఎన్టీఆర్ సరైన పరిణితి లేదు అంటూ ఈ సందర్భంగా మెహర్ రమేష్ కామెంట్స్ చేశారు.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ గురించి ఈయన చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఇదే విషయం గురించి ఎన్టీఆర్ అభిమానులు స్పందిస్తూ నిజంగానే ఎన్టీఆర్ అప్పట్లో కథల ఎంపిక విషయంలో సరైన కథను ఎంపిక చేసుకోలేదని ప్రస్తుతం కథల ఎంపిక విషయంలో ఎంతో పరిణీతి చెందారంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…