Nara Lokesh: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఏదైనా పండుగ వస్తుందంటే పెద్ద ఎత్తున సినిమాలు విడుదలవుతూ నువ్వా…నేనా అన్నట్టు పోటీ పడుతుంటారు. ఈ క్రమంలోనే వచ్చే యేడాది సంక్రాంతి బరిలో పెద్ద ఎత్తున సినిమాలు పోటీ పడబోతున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఎన్నో సినిమాలు విడుదల అవుతున్నప్పటికీ మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ నటించబోతున్న సినిమాల మధ్య పోటీ ఏర్పడనుంది.
చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాలు రెండు కూడా సంక్రాంతి బరిలో విడుదల కానున్నాయి. ఇక ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం.ఈ క్రమంలోనే ఈ ఇద్దరి హీరోల అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఎన్నో పోస్టర్లను విడుదల చేస్తూ పోటీపడుతున్నారు.
బాలకృష్ణ, చిరంజీవి ఇద్దరి హీరోల పేరుతో టీడీపీ ఫర్ ఎవర్ అనే ట్విట్టర్ అకౌంట్ తో ఇద్దరు హీరోలని టార్గెట్ చేస్తూ, కులల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఈయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఈ విషయంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదంతా కూడా వైఎస్ఆర్సిపీ పని అంటూ ఈయన మండిపడటమే కాకుండా ప్రతి ఒక్కరు ఇలాంటి పోస్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కులం మతం పేరు చెప్పి రాజకీయాలు చేసే వారిని చెప్పుతో కొట్టండి. ఇలా ఫేక్ అకౌంట్స్ ఫేక్ ట్వీట్స్ నీకు సంతృప్తినిస్తాయేమో కానీ.. గెలుపును మాత్రం ఇవ్వవు జగన్ రెడ్డి అంటూ నారా లోకేష్ అధికార ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతూ ట్విట్టర్ వేదికగా చేసినటువంటి ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…