Pawan Kalyan:సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎన్నో త్రో బ్యాక్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తుంటారు మన సెలబ్రిటీలు.ఈ క్రమంలోనే ఎంతోమంది చిన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా మరికొందరు మాత్రం తమ అభిమాన హీరో హీరోయిన్లతో కలిసి దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటారు.
ఈ క్రమంలోనే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో టాలీవుడ్ డైరెక్టర్ గత పది సంవత్సరాల క్రితం దిగినటువంటి ఒక ఫోటోని షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆ డైరెక్టర్ ఎవరా అంటూ పెద్ద ఎత్తున ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు. అయితే దర్శకుడు ఇండస్ట్రీలో పలు సినిమాలను చేసినప్పటికీ ఈయనకి పెద్దగా గుర్తింపు రాలేదని చెప్పాలి.
ఈయన ఇండస్ట్రీలో ప్రభాస్ ఎన్టీఆర్ వెంకటేష్ వంటి హీరోలు అందరితో సినిమాలు చేశారు. ప్రస్తుతం ఈయన మెగాస్టార్ చిరంజీవితో కూడా సినిమా చేస్తున్నారు. ఇప్పటికైనా ఆ డైరెక్టర్ ఎవరు గుర్తొచ్చారా… అదేనండి మెహర్ రమేష్.మెహర్ రమేష్ కు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టం ఈ క్రమంలోనే గత పది సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ తో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తానని ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పటివరకు మెహర్ రమేష్ చేసినటువంటి సినిమాలలో కేవలం బిల్లా సినిమా మాత్రమే మంచి విజయాన్ని అందుకుంది ఈయన దర్శకత్వంలో వచ్చిన కంత్రి, శక్తి, షాడో వంటి సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. మరి చిరంజీవితో అయినా ఈ హీరో హిట్టు కొడతారో లేదో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…