Rana Daggubati: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దగ్గుబాటి కుటుంబానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.రామానాయుడు నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు సంపాదించుకోగా ఆయన వారసులుగా సురేష్ బాబు వెంకటేష్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక సురేష్ బాబు వారసుడిగా రానా ఇండస్ట్రీలోకి హీరోగా లీడర్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు.
ఈ విధంగా వరుస సినిమాలతో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రానా గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.రానా 2020 సంవత్సరం ఆగస్టు 8వ తేదీ మిహికా బజాజ్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఈ దంపతులు వివాహం కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరిగింది. కరోనా కారణంగా వీరి కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం ఎంతో ఘనంగా జరిగింది.
ఇకపోతే ఎంతో సంతోషంగా సాగిపోతున్న వీరి వైవాహిక జీవితంలో ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. వీరిద్దరూ మధ్య ఏవో మనస్పర్ధలు వచ్చాయని త్వరలోనే విడాకులు కూడా తీసుకోబోతున్నారంటూ వార్తలు షికార్లు చేశాయి. అయితే ఈ వార్తలన్నింటికీ రానా దంపతులు చెక్ పెట్టారు. ఇకపోతే తాజాగా దంపతులకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది.
దగ్గుబాటి కుటుంబానికి వారసుడు రాబోతున్నారని, రానా మిహికా దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారని వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా రానా తండ్రి కాబోతున్నారని వార్త సోషల్ మీడియాలో తెలియడంతో అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ముందుగానే ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.మరి వీరి గురించి వచ్చే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…