Actress poorna: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా పలు సినిమాలలో నటించి సందడి చేసిన మలయాళీ ముద్దుగుమ్మ పూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రీ మహాలక్ష్మి, అవును, సీమటపాకాయ్, లడ్డు బాబు వంటి తదితర సినిమాలలో నటించిన పూర్ణ హీరోయిన్గా ఇండస్ట్రీలో పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయారు.ఇలా వెండితెరకు దూరమైనప్పటికీ ఈమె బుల్లితెర కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.
ఇలా వెండితెరపై బుల్లితెరపై ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి ఈమె మే 12వ తేదీ దుబాయ్ కి చెందిన ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తతో నిశ్చితార్థం జరిగిన విషయాన్ని తెలియజేశారు. ఇలా నిశ్చితార్థం జరుపుకున్న ఈమె రహస్యంగా జూన్ నెలలో వివాహం చేసుకున్నప్పటికీ ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా అభిమానులతో పంచుకున్నారు.
ఈ క్రమంలోనే దీపావళి పండుగ సందర్భంగా తనకు పెళ్లి జరిగిందనే విషయాన్ని తెలియజేస్తూ తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ఈ క్రమంలోనే పూర్ణ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.ఈ పెళ్లి ఫోటోలలో పూర్ణ ఒంటినిండా బంగారం వేసుకోవడంతో అందరి దృష్టి ఆమె నగలపై పడింది.
ఇకపోతే పూర్ణకు పెళ్లి కానుకగా తన భర్త ఆసిఫ్ తనకు పెద్ద ఎత్తున బంగారం కొనిపెట్టారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పెళ్లికి కానుకగా ఆసిఫ్ ఈమెకు ఏకంగా 1700గ్రాముల బంగారం కానుకగా ఇచ్చారని తెలుస్తుంది. ఇదే కాకుండా మరొక లగ్జరీ అపార్ట్మెంట్ కూడా తనకు బహుమానంగా ఇచ్చారని సమాచారం. ఇక ఈమెకు కానుకగా ఇచ్చిన బంగారం ధర కొన్ని కోట్ల రూపాయల విలువ చేస్తుందని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…