Prathyusha Garimella : హైదరాబాద్ లో శనివారం రాత్రి ఫిల్మ్ నగర్ ఎమ్మెల్యే కాలనీలోని తన నివాసంలోనే ప్రత్యూష గరిమెళ్ల అనే ఫ్యాషన డిజైనర్ ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఒక్కసారిగా టాలీవుడ్ ఉలిక్కిపడింది. ప్రత్యూష చాలా మంది బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలకు డ్రెస్సులు డిజైన్ చేసింది. 35 ఏళ్ల ప్రత్యూష బంజారాహిల్స్ లోని బోతిక్ లోని బాత్రూం లో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. వాచ్ మెన్ వచ్చి డోర్ తట్టినా స్పందించకపోవడంతో వాచ్‌మెన్ పోలీసులకు ఫోన్ చేసారు. దీంతో పోలీసులు వచ్చి మృతదేహాన్ని గుర్తించారు. బాత్‌రూంలో కార్బన్ మోనాక్సైడ్ బాటిల్ దొరికింది. మొదట అనుమానస్పద మృతిగా భావించినా ఆమె రాసిన సుసైడ్ నోట్ లభ్యం అవడంతో సుసైడ్ గా భావిస్తున్నారు.
మీకు భారం కాలేను….
తన ఒంటరి జీవితంతో విసిగిపోయానని, ఇది తాను ఆశించిన జీవితం కాదని ఆమె రాసింది. తన తల్లిదండ్రులపై భారం పడకూడదని మరియు ఇలాంటి ఒక పని చేస్తున్నందుకు చింతిస్తున్నానని సుసైడ్ నోట్ లో రాసింది. ఇక ప్రత్యూష మరణం చాలా మంది సినిమా సెలబ్రిటీలను దిగ్బ్రాంతికి గురిచేసింది. ప్రత్యూష బాలీవుడ్ లో మాధురి దీక్షిత్, దీపిక పడుకొనే, పర్నీత చోప్రా, విద్యాబాలన్, జక్వెలిన్ ఫెర్నాండెజ్, రకుల్ ప్రీత్ సింగ్, జూహి చావ్లా, ఇక ఇటు టాలీవుడ్ లో శృతి హాసన్, ఛార్మి, ఉపాసన, రామ్ చరణ్, రానా వంటి కొంత మంది స్టార్స్ కి డిజైనర్ గా వ్యవహారించింది. ఇక ఉపాసన ప్రత్యూష మరణానికి చింతిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
ఉన్నతంగా ఆలోచించే నువ్వు……
ప్రత్యూష నా ప్రియమైన స్నేహితురాలు.. చాలా త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఆమె మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ప్రతి విషయంలోనూ ఆమె ఉన్నతంగా ఆలోచించేది. కెరీర్ గురించి, కుటుంబం, స్నేహితుల గురించి గొప్ప నిర్ణయాలే తీసుకునేది. అన్ని విషయాల్లో ఉన్నతంగా ఆలోచించే ప్రత్యూష డిప్రెషన్‌కు గురి కావడం బాధ కలిగిస్తోంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలి ట్విట్టర్ వేదికగా కోరుకుంది ఉపాసన. కాగా ఫ్యాషన్ ప్రపంచంలో ప్రత్యూషకు మంచి పేరు ఉంది. ఒంటరితనం, డిప్రెషన్ కి లోనై ఇలాంటి పని చేయడం అందరిని కలచివేస్తుంది. ప్రత్యూష తల్లిదండ్రులు ఢిల్లీలో ఉంటారని నెల కిందట కూడా వచ్చి వెళ్లారని ఇక్కడ పని చేసే వాచ్ మెన్ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…