Mokshagna: కొత్త లుక్ లో సందడి చేసిన మోక్షజ్ఞ.. ఖుషి అవుతున్న నందమూరి ఫాన్స్.. ఫోటో వైరల్!
Mokshagna: ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సీనియర్ హీరోల వారసులు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ప్రేక్షకులను తమదైన శైలిలో సందడి చేస్తున్నారు.ఈక్రమంలోనే నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇదిగో అదిగో అంటూ ఆశలు పెంచుకున్నారు తప్ప ఆయన ఎంట్రీ గురించి మాత్రం అధికారిక ప్రకటన వెలువడలేదు.
మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యతలను బాలకృష్ణ పలువురి డైరెక్టర్ల చేతిలో పెట్టాడు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలిసిపోయింది. మోక్షజ్ఞ కాస్త అధిక శరీర బరువు ఉండటం వల్ల ప్రస్తుతం తన దృష్టి మొత్తం తన శరీర ఫిట్ నెస్ పై పెట్టారని అందుకే ఈయన సినీ ఎంట్రీ కాస్త ఆలస్యం అవుతుందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మోక్షజ్ఞ సరికొత్త లుక్ లో అభిమానుల ముందుకు వచ్చారు.
ఈ క్రమంలోనే బుల్లెట్ పై కూర్చుని ఉన్నటువంటి ఫోటోని షేర్ చేయడంతో ఈ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారింది.ఈ ఫోటో చూస్తే నందమూరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఫోటోలో మోక్షజ్ఞ శరీర బరువు తగ్గి చాలా స్లిమ్ అండ్ ఫిట్ గా ఉన్నారు.ఈ ఫోటో చూసిన నందమూరి అభిమానులు మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి పర్ ఫెక్ట్ గా ఉన్నారని త్వరలోనే ఆయన ఎంట్రీ ఇవ్వబోతున్నారని వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఇకపోతే మోక్షజ్ఞ బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సినిమా సీక్వెల్ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగు పెడతారని పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఎన్టీఆర్ సపోర్ట్ చేస్తే ఈయనకు ఇండస్ట్రీలో తిరుగు ఉండదని అభిమానుల అభిప్రాయం. ఈయన సినీ ఎంట్రీ కోసమే అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…