Featured

Pravesh Shukla : ఒళ్ళు బలిసి మొహం మీద మూత్ర విసర్జన… మధ్యప్రదేశ్ లో అమానుష ఘటన… కాళ్ళు కడిగిన సీఎం…!

Pravesh Shukla : మధ్యప్రదేశ్ లో ఒక గిరిజన వ్యక్తి మీద అమానుష ఘటన జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనలో ప్రవీణ్ శుక్ల అనే ఒక ఒళ్ళు బలిసిన వ్యక్తి ఒక వ్యక్తి మొహం మీద మూత్ర విసర్జన చేసాడు. చేస్తున్నపుడు వీడియో తీయించుకున్నాడు. ఇపుడు ఈ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ప్రతి ఒక నేటిజెన్ ప్రవీణ్ శుక్ల మీద కోప్పడుతున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా ఊపేసింది. రాజకీయ రంగు పులుముకుని మధ్యప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.

కాళ్ళు కడిగిన సీఎం…

మొహం మీద మూత్ర విసర్జన చేసి అమానుషంగా ప్రవర్తించిన్న వ్యక్తి పేరు ప్రవీణ్ శుక్ల. ఇతను అక్కడి స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మనిషి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద విరుచుకుపడటం మొదలు పెట్టింది. జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ యూపి లో ఇటీవలే ఇలాంటి ఘటన జరుగగా ఇపుడు మధ్య ప్రదేశ్ లో జరిగింది, దళితులు, గిరిజనుల మీద బీజేపీ పాలిత రాష్ట్రాలలో దాడులు జరుగుతున్నాయని విమర్శించారు.

అయితే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రవీణ్ శుక్ల బీజేపీ కి సంబంధం లేదని వాదించింది. అతని ఇంటిని కూల్చేసింది. ఇక బాధిత గిరిజన యువకుడు దేశమత్ రావత్ ను సీఎం ఇంటికి పిలిపించుకుని అక్కడ ఆయన ను కూర్చోబెట్టి సీఎం కింద కూర్చొని ఆయన కాళ్ళను ఒక పళ్లెంలో పెట్టి కడిగారు. ఆ పైన ఆయనకి తిలకం దిద్ది, దండ వేసారు. గిరిజనుల మీద దాడులను మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉపేక్షించదని తెలిపారు. ఇప్పటికే ప్రవీణ్ శుక్ల ను అరెస్టు చేసి శిక్ష విధించారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago