తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో వింత ఘటన చోటు చేసుకుంది. గర్భంలోని శిశువు మాయమైందని ఒక మహిళ ఆస్పత్రి యాజమాన్యంపై ఆరోపణలు చేసింది. మహిళ చేసిన ఆరోపణలు ప్రసూతి ఆస్పత్రిలో కలకలం రేపాయి. పూర్తి వివరాల్లోకి వెళితే తిరుపతి పట్టణంలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన శశికళ వచ్చారు. ఆమె గర్భవతి కావడంతో ఆస్పత్రిలో డాక్టర్లతో పరీక్షలు చేయించుకోవడంతో పాటు మందులు వాడారు.
ఈరోజు మరోసారి ఆస్పత్రికి వచ్చిన మహిళ పరీక్షలు చేయించుకోకుండా ఆస్పత్రి సిబ్బంది తన గర్భంలో నుంచి శిశువును మాయం చేశారంటూ వింత ఆరోపణలు చేశారు. తాను ఆస్పత్రికి కాన్పు కోసం వచ్చానని అయితే ఆస్పత్రి సిబ్బంది మాత్రం తన కడుపులో బిడ్డ లేదని చెబుతున్నారని పేర్కొన్నారు. వైద్యులే తన కడుపులోని బిడ్డను మాయం చేశారంటూ సదరు మహిళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆస్పత్రి నిర్వాహకులతో తన బిడ్డ గురించి చెప్పాలంటూ మహిళ వాగ్వాదానికి దిగారు. మహిళ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆస్పత్రి సిబ్బంది అవాక్కయ్యారు. మహిళ ఆస్పత్రి తీరును తప్పు పడుతున్న నేపథ్యంలో ఆస్పత్రి సిబ్బంది అలిపిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు తెలిసే అవకాశం ఉంది. అయితే వైద్యులు ఆ మహిళ గర్భం దాల్చలేదని చెబుతున్నారు.
కడుపులో ఉండే గాలి బుడగలను మహిళ గర్భంగా భావిస్తోందని పేర్కొన్నారు. మహిళ మానసిక స్థితి గురించి కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ ఘటన గురించి దర్యాప్తు చేస్తున్నారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…