Prem Rakshith: నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు అందుకోవడంతో ప్రతి ఒక్కరు ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు తన . అయితే ఈ పాటకు కొరియోగ్రఫీ అందించినటువంటి కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ సైతం తాను కొరియోగ్రఫీ అందించిన ఒక పాటకు అంతర్జాతీయ వేదికపై అవార్డు అందుకోవడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
ఇలా ఈయన కూడా ఆస్కార్ అవార్డు వేడుకలలో పాల్గొన్నారు. అయితే అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన ప్రేమ్ రక్షిత్ తాజాగా ఆస్కార్ జర్నీ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ప్రేమ్ రక్షిత్ మాట్లాడుతూ తనకు ఆస్కార్ అవార్డు వేడుకకు వెళ్లడానికి అసలు వీసానే దొరకలేదని తెలిపారు. కానీ కార్తికేయ, వల్లి, రమా మేడమ్ ఈ ముగ్గురి ప్రోత్సాహం వల్లే తాను అమెరికా వీసా పొందానని ఆస్కార్ అవార్డుకు వెళ్లానని తెలిపారు.
కేవలం నాకు ఐదు రోజుల వరకు మాత్రమే వీసా లభించిందని ఆస్కార్ వేడుకకు ఒక రోజు ముందు అమెరికా వెళ్లాలని తెలిపారు. అక్కడ రిహార్సల్స్ చేసిన తర్వాత ఆ పాటకు ఆస్కార్ వేదికపై డాన్స్ వేయడంతో పాట పూర్తి కాగానే అందరూ లేసి ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు ఆ క్షణం కళ్ళల్లో నీళ్లు వచ్చాయని ప్రేమ్ రక్షిత్ తెలిపారు.
ఇక వేదికపై కీరవాణి సర్ ఆస్కార్ అవార్డు అందుకోవడంతో ఒక్కసారిగా తనని ఆలింగనం చేసుకున్నారని ఆ క్షణం తనకు మాటలు రావడం లేదని ఈ సందర్భంగా ప్రేమ్ రక్షిత్ తన ఆస్కార్ జర్నీ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.ఇలా ఆస్కార్ అవార్డు గురించి ప్రేమ్ రక్షిత్ మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…