సాధారణంగా ఆత్మాభిమానంతో ఉన్న వారికి సంబంధించిన కొన్ని విషయాలు అందరికీ తెలిస్తే ఎంతో కృంగిపోతారు. ఇలాంటి విషయాలలో ఎంతో సున్నితంగా ఉండేవారు ఆ సమయంలో ఎలాంటి అఘాయిత్యం చేసుకోడానికి అయినా వెనుకాడరు. అచ్చం ఇలాగే ఓ పూజారి తనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
రాజస్తాన్‌లోని ఆల్వార్ జిల్లాలో ఓ గుడిలో జగదీష్ అనే పూజారి పని చేసేవాడు. ఈ క్రమంలోనే గుడిలో పూజలు చేస్తుండగా ఓ మహిళ గత బుధవారం పూజారి పై చేయి చేసుకుంది. ఈ క్రమంలోనే పూజారి పై చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో జగదీష్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే శుక్రవారం పూజారి విషం తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు.
జగదీష్ ఈ విధంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు గమనించిన అతని కుటుంబ సభ్యులు అతనిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పూజారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఈ క్రమంలోనే తన తండ్రికి ఇలాంటి పరిస్థితి ఎదురు కావడానికి కారణమైన మహిళపై పూజారి కొడుకు సర్దార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
ఈ క్రమంలోనే మహిళ కూడా పూజారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుడిలో పూజారి తనను వేధింపులకు గురి చేసినట్లుగా ఫిర్యాదులో పేర్కొంది అందుకోసమే తనని కొట్టానని మహిళ తెలియజేసింది. వీరి ఫిర్యాదు అందుకున్న పోలీసులు మాట్లాడుతూ మహిళ గుడిలో పూజారిని చెప్పుతో కొట్టినప్పుడు ఆలయంలో ముగ్గురు భక్తులు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతోనే పూజారి ఎంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…