Featured

Priyadarshini Ram : షర్మిల, భారతి మధ్య ఆస్తి తగదాలు… సాక్షి నుండి బయటికి రావడానికి కారణం… నా లవ్ స్టోరీ…: సాక్షి ప్రియదర్శిని రామ్

Priyadarshini Ram : సాక్షి పేపర్ చదివేవారికి పరిచయం అక్కర్లేని లవ్ డాక్టర్ రామ్ ప్రియదర్శిని. సాక్షి వార్తపత్రికలో ఎంటర్టైన్మెంట్ విభాగంలో పనిచేసిన రామ్ ఆ పత్రిక ద్వారా కొత్త పోకడలను పరిచయం చేసారు. అలాగే సాక్షి న్యూస్ ఛానెల్ లో కూడా పనిచేసిన ఆయన అక్కడ న్యూస్ ఛానెల్స్ లో కొత్త ట్రెండ్స్ ను పరిచయం చేసారు. రామ్ పూర్తి పేరు పత్తి లక్ష్మి రామిరెడ్డి కాగా ప్రియదర్శినీ రామ్ అలాగే సాక్షి రామ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సినిమా ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టి ఉపేంద్ర హీరోగా ‘టాస్’ అనే సినిమాను తీశారు. అలాగే మనోడు అనే సినిమాలో హీరోగా కూడా నటించారు. ఇక మరికొన్ని సినిమాల్లో కూడా అతిధి పత్రాల్లో నటించారు. జ్యోతిలక్ష్మి, వినయ విధేయ రామ ఇలా పలు చిత్రాల్లో కనిపించారు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో వైఎస్ కుటుంబం గురించి అలాగే తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు.

షర్మిల, భారతి మధ్య విబేధాలు…

రామ్ అన్న సిద్ధార్థ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో బాగా చనువుగా ఉండటం వాళ్ళ రాజీవ్ గాంధీ గారితో బాగా సన్నిహితంగా ఉండేవారట. ఇక రామ్ గారు రాజశేఖర్ రెడ్డి గారికి బాగా సన్నిహితులు కావడంతో జగన్ సాక్షి టీవీ పెట్టినపుడు హెల్ప్ చేయమని అడగడంతో వెళ్లానని తెలిపారు. వైఎస్ కుటుంబంలో అందరూ చాలా బాగా చూసుకుంటారని తెలిపారు. జగన్ తన కుటుంబాన్ని బాగా చూసుకుంటారని వారి మధ్య విబేధాలు లేవంటూ చెప్పారు. షర్మిల, భారతి మధ్య ఎలాంటి తేడాలు లేవు అంటూ రామ్ చెప్పారు. ఇప్పటికీ భారతి గారు షర్మిల ఇంటికి వెళ్తారు పిల్లల గురించి అడుగుతుంటారు అంటూ చెప్పారు.

ఇక తన లైఫ్ గురించి చెబుతూ బళ్లారి నుండి తన పూర్వికులు అనంతపురం జిల్లా గుత్తి పక్కన పల్లెకు వచ్చారని 1000 ఎకరాలు ఉండగా అంతా పోయి నాలుగు ఎకరాల పొలం మిగిలింది అదే మా కుటుంబానికి ఆధారం అయింది అంటూ చెప్పారు. ఇక తన అన్న సిద్ధార్థ రెడ్డి కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు తీసుకోవడం వల్ల రాజీవ్ గాంధీ గారు బాగా సన్నిహితంగా ఉండేవారు. ఆయనే అన్న పెళ్లి చేసారు. ఇక నా పెళ్లి ప్రేమ వివాహం అంటూ చెప్పారు. ఠాగూర్ శారద చౌహన్ ను మొదటి సారి చుసినపుడే ఇష్టపడ్డానని మా అమ్మను బాగా చూసుకునే అమ్మాయినే చేసుకోవాలని అనుకున్నాను, అలాంటి అమ్మాయి శారద అనిపించింది చూడగానే చెప్పేసాను, మా అమ్మను బాగా చూసుకుంటావా అని అడిగేసాను అంటూ చెప్పారు లవ్ డాక్టర్. ఇక సాక్షి నుండి బయటకి రావటానికి నేనే కారణం, సినిమాల మీద ఇష్టంతో బయటకి రావాల్సి వచ్చిందని చెప్పారు.

Bhargavi

Recent Posts

నా మాటలను వక్రీకరించారు.. ప్రకాశ్ రాజ్ క్లారిటీ

సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…

16 hours ago

డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపితే… మీ ఆరోగ్యానికి రిస్క్

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…

1 day ago

కొబ్బరి చట్నీ కేవలం రుచే కాదు… ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి!

ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…

1 day ago

వేసవిలో విత్తనాలు తింటున్నారా? చియా నుంచి అవిసె వరకు… వేసవిలో ఎలా తినాలి? తెలియకపోతే రిస్క్!

వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…

1 day ago

బయట బాగుంటుంది… లోపల ఖాళీ! సరైన కొబ్బరికాయను ఎలా ఎంచుకోవాలి?

కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…

1 day ago

ఆరోగ్యానికి అల్ఫాల్ఫా గింజలు ఉపయోగమా? తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…

1 day ago