KalyanDev: మెగా డాటర్ శ్రీజ కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తిని రెండవ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా వీరిద్దరి వివాహం జరిగి ఒక కుమార్తె జన్మించిన తర్వాత విడాకులు తీసుకొని విడిపోయారని వార్తలు వస్తున్నాయి. ఈ విధంగా కళ్యాణ్ దేవ్ శ్రీజ దంపతులకు నవిష్క అనే కుమార్తె జన్మించిన తర్వాత ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుని దూరంగా ఉన్నారంటూ వార్తలు వచ్చాయి కానీ ఈ వార్తలకు ఎలాంటి అధికారక ప్రకటన లేదు.
ఇకపోతే ఈ వార్తలకు బలం చేకూరేలా వీరిద్దరూ దూరంగా ఉండటమే కాకుండా శ్రీజ తన ఇద్దరు పిల్లలని తన వద్ద పెట్టుకున్నారు. ఇక మెగా కుటుంబంలో జరిగే ఫంక్షన్ లకి కూడా కళ్యాణ్ దేవ్ హాజరు కావడం లేదు.దాదాపు రెండు సంవత్సరాలపాటు తన భార్య పిల్లలకు దూరంగా ఉండడంతో ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారని అందరూ భావిస్తున్నారు. అయితే తాజాగా కళ్యాణ్ విడాకులు తీసుకున్నాను అంటూ క్లారిటీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఈయన సోషల్ మీడియా వేదికగా తన కుమార్తె నవిష్కతో కలిసి ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ వారంలో ఈ నాలుగు గంటలే ఆనందంగా గడిపే క్షణాలు అంటూ పోస్ట్ చేశారు దీంతో ఈయన తన భార్యకు విడాకులు తీసుకున్నారని అందరూ ఫిక్స్ అయ్యారు.సాధారణంగా భార్యాభర్తలు విడాకుల కోసం కోర్టుకు అప్లై చేసిన సమయంలో ఇద్దరి వాదోపవాదనలు విన్న తర్వాత పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి అనే విషయాలను నిర్ణయిస్తారు.
ఈ క్రమంలోనే శ్రీజ తన పిల్లలు తన వద్ద ఉండేలా కోర్టు తీర్పు ఇవ్వగా వారంలో కేవలం నాలుగు గంటలు మాత్రమే తన కుమార్తె తండ్రి వద్ద ఉండేలాగా తీర్పు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఈయన నాలుగు గంటలు ఆనంద క్షణాలు అంటూ పోస్ట్ చేయడంతో ఇద్దరు విడాకులు పక్కాగా తీసుకున్నారని అర్థమవుతుంది. శ్రీజకు విడాకులు ఇచ్చిన తర్వాత సినిమాలకు కూడా దూరంగా ఉంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…