Movie News

ఎంత మోసం.. ఇది ప్రియమణి కాదు పైడమ్మ.. ఆమె చెప్పిన నిజం.. దీప కాపురం చక్కబడినట్లే!

బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా సాగుతున్న కార్తీకదీపం సీరియల్ నేడు 1093 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. గత ఎపిసోడ్ లో దీపం మోనిత ఇంటికి వెళ్లి దుర్గ గుర్తున్నాడా.. అంజి గుర్తున్నాడా అంటూ తనని భయపెడుతుంది. ఇక నేడు ఎపిసోడ్ లో భాగంగా దీప ఇంట్లో తన పిల్లలతో పాటు శ్రావ్య అందరూ తన మామయ్య కోసం ఎదురు చూస్తుంటారు. ఇంతలో ఆదిత్య తన తండ్రిని తీసుకుని రావడంతో పిల్లలందరూ తమ తాతయ్య హత్తుకొని ఎంతో సంతోషంగా ఉంటారు.తాతయ్య తెచ్చిన గిఫ్ట్ కార్లో ఉన్నాయంటూ పిల్లలు సంతోషంతో బయటకు వెళ్లిపోగా, దీపా శ్రావ్య వంట చేయడానికి వెళ్తారు. ఆనందరావు, కార్తీక్ సోఫాలో కూర్చుంటారు.

ఇప్పుడు చెప్పురా.. పిల్లల నవ్వులో తప్ప మీ నవ్వులో జీవం లేదు. నవ్వు అంటే శబ్దం కాదు అదొక అనుభూతి అది ఎందుకో లోపించినట్లు ఉంది అంటాడు.ఊరుకో డాడీ నువ్వు.. గళ్లున నవ్వే వయసా మాదీ..? అవును మమ్మీకి కాల్ చేశావా’అంటూ కార్తీక్ మాట మార్చడంతో ఆనందరావు మరో నాలుగు రోజుల్లో మమ్మీ కూడా వచ్చేస్తుంది అంటాడు. ఇక ఇంటరాగేషన్ లో భాగంగా సీసీ కెమెరాలు ఉన్న గదిలో ఉంచిన ప్రియమణిని మళ్లీ పిలిచి ప్రశ్నలతోనే వణికిస్తుంది రోషిణీ.

ఈ క్రమంలోనే నీ పేరేంటి? అని రోషిణీ అడగగా ప్రియమణమ్మా… అంటుంది ప్రియమణి. నేను అడిగింది నీ పేరు ఏంటని అంటూ మూడుసార్లు అడగగా భయంతో ప్రియమణి అసలు పేరు పైడమ్మ అనే విషయం బయట పెడుతుంది. గుడ్ ఒక్క నిజం చెప్పావు మొత్తానికి అని అంటూనే నీకు చాలా నిజాలు తెలుసు అనే విషయం నాకు తెలుసు. ఆ నిజాలు బయట పెడితే మీ మేడం నిన్ను చంపేస్తుందన్న విషయం నాకు తెలుసు అంటుంది రోషిణీ. మీకు దండం పెడతానమ్మ నాకు నిజంగానే ఏమీ తెలియదని ప్రియమణి వణుకుతూ చెబుతుంది.

అవును మీ అమ్మగారికి ఫోన్ చేద్దామని ఫోన్ బయటకి తీసావు… కానీ ఎందుకు చేయలేదని రోషిణీ అడగగా లేదమ్మా నేను అసలు ఫోన్ బయటికి తీయలేదని ప్రియమని చెప్పడంతో అవునా …ఇదేంటి మరీ అని సీసీ కెమెరా రికార్డ్‌ని చూపించడంతో.. ప్రియమణి భయపడుతుంది. ఫోన్ బయటకు తీసిన దానివి ఎందుకు చేయలేదని రోషిణీ అడగగా..మీరు ఇలాంటివి ఏవో సెటప్ చేసి ఉంటారని చేయలేదు అంటూ సీసీ కెమెరా రికార్డ్ ను చూపిస్తూ. కార్తీక్ మీ అమ్మ గారి దగ్గరికి వస్తుంటాడా..? అని రోషిణీ అడగగా.. వస్తుంటాడు… పోతుంటాడు అంటూ ప్రియమణి సమాధానం చెబుతుంది.

ఈ వస్తూ… పోతూ ఉండటం మధ్య వాళ్ళిద్దరు ఏం చేస్తుంటారు? ఇద్దరూ మాట్లాడుతూనే ఉంటారమ్మ.. మరి మాట్లాడితే మీ అమ్మగారు తల్లి ఎలా అయింది? సరే “కార్తీక్‌ని మోనిత ప్రేమించిందా”..? “మోనితే కార్తీక్‌ని ప్రేమించిందా”..?అని అడగడంతో.. మా అమ్మగారు కార్తీక్ బాబును కాస్త ఎక్కువగా ప్రేమించింది. కార్తీక్ బాబు మా అమ్మను కాస్త తక్కువగా ప్రేమించాడు అని సమాధానం చెబుతుంది. కార్తీక్ తక్కువగా ప్రేమించినా.. తప్పు జరిగిపోయింది అంటావు. లేదంటే మోనిత తల్లి కావడానికి అని సందేహ పడుతున్న రోషిణీతో మా అమ్మ తల్లి కావడానికి కార్తీక్ అయ్యే కారణమంటూ చెబుతుంది.

నేను రాకముందు కార్తీక్ అయ్య మోనితమ్మాను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చారట. ఓసారి పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోయిందట.. కార్తీక్ అయ్య వాళ్ల అమ్మ ఆపేశారని ప్రియమణి చెప్పడంతో రోషిణీ ఆలోచనలో పడి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు పిలిచినప్పుడు రావాలి. ఇక్కడ జరిగినదేది మీ అమ్మగారికి చెప్పకు అని పంపిస్తుంది.అయితే మొనిత దగ్గరికి వెళ్ళిన ప్రియమణి జరిగినదంతా చెబుతుంది. దీపతో పాటు మోనిత దగ్గరికి వెళ్లిన భాగ్యం ఇంటికి వెళ్లి తన భర్తతో కూతురు జీవితం బాగు పడినట్లే అని చెప్పడంతో ఎంతో సంతోషిస్తారు.ఇక దీప ఇంట్లో అందరూ కలిసి ఎంతో సంతోషంగా భోజనం చేస్తుంటారు. కార్తీక్ మాత్రం ప్లేట్లులో గీతలు గీస్తూ ఆలోచిస్తుంటాడు.దాంతో ఆనందరావు.. ‘ఏమైంద్రా? గీతలు గీస్తున్నావ్’ అని అడగడంతో.. సౌర్య.. ‘అవును తాతయ్యా.. డాడీ ఇంట్లో కూడా గోడ పై గీతలు గీస్తున్నాడు అని చెప్పడంతో దీప ,కార్తీక్ బిత్తరపోతారు. తరువాత ఏం జరుగుతుందో అనేది మరో ఎపిసోడ్ వరకు వేచి ఉండాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

చక్రి మరణంపై షాకింగ్ నిజాలు.. రఘు కుంచె క్లారిటీ

దివంగత సంగీత దర్శకుడు చక్రి మరణంపై ఎన్నాళ్లుగానో వినిపిస్తున్న పుకార్లకు తెరదించిన వ్యాఖ్యలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ గాయకుడు,…

8 minutes ago

ఇలా కూర్చుంటే రక్తపోటు పెరుగుతుందా? షాకింగ్ ఫ్యాక్ట్!

ఇటీవల జీవనశైలిలో మార్పులతో పాటు కూర్చునే విధానాలపై కూడా ఆరోగ్య నిపుణులు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా కాళ్లు మడిచుకుని ఎక్కువసేపు…

20 minutes ago

దేవుడికి నమస్కారం చేస్తే ఎందుకు కళ్లు మూసుకుంటాం? అసలు కారణం ఇదే!

దేవాలయంలోనూ, ఇంట్లోనూ ప్రార్థన చేసే సమయంలో చాలా మంది సహజంగా కళ్లు మూసుకుని చేతులు జోడిస్తారు. ఇది కేవలం అలవాటు…

50 minutes ago

తెలంగాణలో ఎవరి జనాభా ఎక్కువ?.. కుటుంబ సర్వేలో బిగ్ రివీల్

తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా సామాజిక వర్గాల మధ్య కూడా విస్తృత చర్చకు…

1 hour ago

అమావాస్య వెనుక ఉన్న పురాణ కథ తెలుసుకుంటే ఆశ్చర్యమే!

ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథి గురించి సాధారణంగా చాలా మందిలో అశుభ భావన ఉంది. ముఖ్య పనులు, శుభకార్యాలు…

1 hour ago

అంతర్జాతీయ విజయాల కోసం తిరుమల చేరుకున్న పీవీ సింధు!

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…

2 hours ago