Producer Chittibabu : నీ గతం చెప్తే సిగ్గుతో… నోటి దూల తగ్గించుకో రోజా… చిరంజీవి, పవన్ కళ్యాణ్ ను తిడితే జాగ్రత్త…: ప్రొడ్యూసర్ చిట్టిబాబు

Producer Chittibabu : ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో విపక్షం తెలుగు దేశమైనా అధికారపక్షం విమర్శలు మాత్రం జనసేన పార్టీ మీద, ఆ పార్టీ అధినేత మీదే. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి ఇంతవరకు విమర్శలు చేస్తూ వచ్చిన వైసీపీ వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు వ్యక్తిత్వం లేదు సొంతంగా ఆలోచించలేడు అంటూ విమారుస్తున్నారు. ఏకంగా సీఎం జగన్ కూడా పవన్ మూడు పెళ్లిళ్ల గురించి విమర్శిస్తున్నారు. ఇక రోజా, పేర్ని నాని, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, బొత్స వంటి వారి నోటికి అదుపు లేకుండా ఉంది. ఇక పవన్ కళ్యాణ్, బాలకృష్ణ షో అన్ స్టాపబుల్ లో పాల్గొనడం గురించి వైసీపీ పార్టీ నేత మంత్రి రోజా మెగా ఫ్యామిలీ మీద చేసిన కామెంట్స్ మీద ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు మాట్లాడారు.

రోజా నీ గతం గుర్తు చేసుకో…

మెగా ఫ్యామిలీ ఎవరికి సహాయం చేసారో ఎవరికీ తెలియదు అంటూ రోజా చేసిన విమర్శలకు ప్రొడ్యూసర్ చిట్టిబాబు మాట్లాడుతూ నీ గతం గుర్తు చేసుకుని మాట్లాడు అంటూ విమర్శించారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఎవరికీ సహాయం చేయలేదు అని మాట్లాడేముందు నువ్వేం సహాయం చెస్తున్నావు, ఒక రాష్ట్ర మంత్రి గా ఎటువంటి పనులు చేస్తున్నావో చెప్పు అంటూ ఫైర్ అయ్యారు. వాళ్ళు ఏం చేసారో ప్రజలు చూస్తున్నారు వారికి అన్నీ తెలుసు, ముందు నీ నోటి దురుసు తగ్గించుకో, లేకపోతే ఈ సారి ఎన్నికలలో నువ్వు గెలవలేవు అంటూ మాట్లాడారు.

జగన్ దగ్గర మెప్పు కోసం మెగా ఫ్యామిలీని తిట్టడం చేస్తున్నారు కొంతమంది ఏపీ మంత్రులు, మీ ప్రభుత్వం పని అయిపోయింది సర్వత్ర వ్యతిరేకత మొదలవడంతో ఏం చేయాలో తెలియక ప్రతిపక్షాల మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు అంటూ మాట్లాడారు చిట్టిబాబు. డబ్బులిస్తున్నారని జబర్దస్త్, బతుకు జట్కా బండి వంటి ప్రోగ్రామ్స్ చేసావు ఒకసారి గతం గుర్తు చేసుకో అంటూ మాట్లాడారు చిట్టిబాబు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago