సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను బడా నిర్మాతలు మంత్రి పేర్ని నానితో కలసి మాట్లాడారని.. ఆ విషయాలను పరిశ్రమకు స్పష్టంగా తెలపకపోవడం వల్లనే పవన్ కల్యాణ్, పోసాని మధ్య వివాదానికి కారణమయ్యాయని ప్రముఖ నిర్మాత, దర్శకుడు నట్టికుమార్ తెలియజేశాడు. పవన్ కళ్యాణ్ తో సినిమాలను తీస్తున్న కొందరు నిర్మాతలు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ వల్లనే ‘పవన్ కళ్యాణ్ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్’లో అలా మాట్లాడాల్సి వచ్చిందన్నారు.
శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకురుల సమావేశంలో అతడు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి ఏమైనా మాట్లాడొచ్చు కానీ.. పెద్ద స్టార్ అయిన పవన్ సినీరంగం గురించి మాట్లాడేటప్పుడు వాస్తవిక విషయాలు తెలుసుకుని మాట్లాడితే బావుండేదన్నారు. ఇదిలా ఉండగా.. అతడు మాట్లాడిన మాటలు బయట రచ్చ రచ్చ జరుగుతున్న నేపథ్యంలో నిన్న మంత్రి వద్దకు పవన్ తో సినిమా తీస్తున్న ఆ వ్యక్తులు వెళ్లి క్షమాపణలు అడిగారట.. వారిని పవన్ పంపించినట్లు బయట వార్తలు వస్తున్నాయి. అయితే దీనిని పవన్ ఎలా తీసుకుంటారు. ఆ నిర్మాతల డబుల్ గేమ్ ను సమర్థిస్తారా? లేదా? అన్నది ఆయనే తేల్చుకోవాల్సిన విషయం.
పోసాని ఇంటిపై దాడి చేయడం అనేది ముమ్మాటికి తప్పు అని.. క్షమించరాని నేరం అంటూ పవన్ ఫ్యాన్స్ పై మండిపడ్డారు. దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు నట్టి కుమార్. ఎలాంటి వివాదాలు చోటు చేసుకున్నా అందులో ఫ్యామిలీని తీసుకురావడం కరెక్ట్ కాదని అన్నాడు. చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరూ అన్నదమ్ముళ్లాగా కలిసి ఉండాలన్నారు.
ప్రాణాలను తీయాలని చూసే వారు ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాన్స్ కాలేరని..సేవా కార్యక్రమాలు, ఎదుటి వారికి సహాయం చేసే గుణం ఉన్నవాళ్లే నిజమైన ఫ్యాన్స్ అన్నారు. చిరంజీవి దీనిని సీరియస్ గా తీసుకొని ఇటువంటివి మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…