మా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది ఒకరిపై ఒకరు దూషణలకు దిగుతున్నారు. ఒకరిపై ఒకరు విమర్శణాస్త్రాలు సంధించుకుంటున్నారు. పవన్ వ్యాఖ్యలను ఉద్దేశించి మా బరిలో దిగుతున్న అభ్యర్థులు పవన్ పై విలేకురుల సమావేశం పెట్టి మరీ విమర్శిస్తున్నారు. దీనిపై ప్రకాష్ రాజ్ ఘాటూగా స్పందించారు. పవన్ విషయంలో మంచు విష్ణు ప్యానెల్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఇటీవల నరేష్ మాట్లాడుతూ.. ‘తాను నాన్ లోకల్ అని విమర్శించారని.. తాను ‘మా’లో సభ్యుడినే అని.. రెండు, మూడు సార్లు మత్రమే ఓటు వేయలేదు అని అన్నారు. తనను నాన్ లోకల్ అని విమర్శించిన మనిషికి సిగ్గుండాలంటూ’ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రెండు నేషనల్ అవార్డులు తెచ్చానని..వీరు ఎవరైనా తెచ్చారా.. తెలుగు సినిమా గర్వించే పని చేశాను. తెలుగు సాహిత్యం మీద ఏ చర్చ పెట్టినా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరాడు.
ఇక మా ఎన్నికల్లో పవన్ కాళ్యాణ్ ను లాగడంపై ఆవేదన వ్యక్తం చేశాడు. పవన్ ను ఇందులోకి అనవసరంగా లాగుతున్నారని.. పవన్ కళ్యాణ్ పై మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చాడు. మంచు విష్ణు ప్రశ్నించిన దానిపై ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ప్రకాష్ రాజ్.. పవన్ కళ్యాణ్ వైపా? ఇండస్ట్రీ వైపా? అని అన్నారని.. దానికి సమాధానంగా ప్రకాష్ రాజ్ ఇలా అన్నాడు.. పవన్ ది సినిమా పరిశ్రమ కాదా..? మీరు అతడిని పక్కన పెట్టారా.. ముందుగా అతడు మా సభ్యుడు.. ఆ తర్వాత రాజకీయ నాయకుడు.
ఆయనకు, జగన్‌కు ఎన్నో ఉంటాయి. సినిమా సమస్యలు గురించే పవన్ మాట్లాడారని అన్నాడు. పవన్ కళ్యాణ్ మార్నింగ్ షో అంత ఉండదు మీ సినిమా బడ్జెట్. పవన్ అడిగింది ఇండస్ట్రీ సమస్యలే. నేను ఎవరు పక్కన ఉన్నానని వారు అడగడం ఎందుకు? మా ఎన్నికలు జరుగుతున్నప్పుడు.. దాని గురించి మాట్లాడాలి. నాకు పవన్ క్లోజ్ ఫ్రెండ్ కాదు. రాజకీయ పరంగా మా మధ్య విభేదాలు ఉన్నాయి. అయినా కలిసి సినిమాలు చేస్తున్నామన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…