Producer Pokuri Babu Rao : యువతరం కదిలింది సినిమాతో ఇండస్ట్రీ కి వచ్చిన పోకూరి బాబు రావు గారిది ఒంగోలు. డైరెక్టర్ టి కృష్ణ గారు ఈయనకు సీనియర్ కావడం వల్ల కాలేజీ లోనే పరిచయం దాదాపు టి కృష్ణ గారు మరణించేవరకు కూడా ఆయనతోనే ఉన్న పోకూరి బాబు రావు గారు ఆయనతోనే పలు విప్లవ సినిమాలను చేసారు. ఎర్ర మందారం, నేటి భారతం, భారత నారీ, ప్రజాశ్వమ్యం వంటి విప్లవ సినిమాలను చేసిన టి కృష్ణ, పోకూరి బాబురావు ధ్వయం, కృష్ణ గారు మరణించాక ఆయన కొడుకు గోపీచంద్ తో కలిసి యజ్ఞం, రణం సినిమాలను చేసారు. తాజాగా ఒక ఇంటర్వ్యూ పాల్గొన్న ఆయన తన కెరీర్ అనుభవాలను పంచుకున్నారు.
ఏఎన్ఆర్ గారు అలా అనేసరికి షాక్ అయ్యాను….
పోకూరి బాబు రావు గారు నిర్మాతగా సినిమాలను నిర్మించడమే కాకుండా కొన్ని సినిమాల్లో నటించారు కూడా. అందులో నవయుగం, ప్రేమ తపస్సు వంటి సినిమాలు ఉన్నాయి. అయితే ఆ రెండు సినిమాల్లో ఆయన నటనకు మంచి మార్కులు పడిన సినిమాలు పెద్దగా హిట్ అవ్వకపోవడం వల్ల మళ్ళీ నటన వైపు వెళ్ళలేదు. అయితే రగులుతున్న భారతం సినిమా కోసం ఒక పాత్రకు అడుగగా ఆ సినిమాలో నాగేశ్వరావు గారు, దాసరి గారు ఉన్నారని ఒప్పుకున్నారట పోకూరి బాబురావు.
ఇక ఆ సినిమా షూటింగ్ సమయంలో నాగేశ్వరావు గారికి పోకూరి గారిని ఆ సినిమా నిర్మాత పరిచయం చేయగా “ఎందుకు ఆర్టిస్ట్ అయ్యారు శుభ్రంగా సినిమాలు నిర్మించుకోవచ్చు కాదా, ఓ నిర్మాత ఆర్టిస్ట్ అయితే ప్రతి ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్లి దండం పెట్టి పిల్చుకురావాల్సిన పనిలేదనా” అంటూ చమత్కరించారట. అయితే పోకూరి గారు మాత్రం అన్నింటికి సమాదానంగా నవ్వారట . ఇక ఆ సినిమాలో హీరోయిన్ గా ఉన్న దివ్య వాణిని రేప్ చేసే సీన్ ఉండగా నాగేశ్వరావు గారు ఏంటి విలన్ గారు నెక్స్ట్ రేప్ సీన్ అంటకదా బాగా చేయండి రేప్ అని చెప్పి వెళ్లారట. అలానేసరికి పోకూరి బాబురావు గారు బాగా షాక్ లో ఉండిపోయారట.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…